Gaddar Daughter Vennela : గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పై ఆయన కుమార్తె వెన్నెల స్పందించక తప్పలేదు. మంగళవారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన తండ్రి పదవుల కోసం, డబ్బు కోసం, అవార్డుల కోసం పనిచేయలేని చెప్పారు. తెలంగాణ కోసం మాత్రమే తన తండ్రి అహర్నిశలు కృషి చేశారని.. పేద ప్రజల కోసం పాటుపడ్డారని.. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేశారని గుర్తు చేశారు. శరీరంలో బుల్లెట్లు పెట్టుకొని కూడా.. ప్రజల కోసం గద్దర్ కొట్లాడారని కొనియాడారు. తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన గద్దర్ స్థాయి తగ్గదని వెన్నెల పేర్కొన్నారు. అసలు అవార్డులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమా? లేక భారతీయ జనతా పార్టీ నా అని వెన్నెల ప్రశ్నించారు..
బండి సంజయ్ పై విమర్శలు
గద్దర్ పై బండి సంజయ్ విమర్శలు చేసిన నేపథ్యంలో.. గద్దర్ కుమార్తె వెన్నెల వ్యూహాత్మకంగానే మాట్లాడారు. ఎక్కడ కూడా బండి సంజయ్ పై కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. తన తండ్రి చేసిన పోరాటాలను మాత్రమే ఆమె గుర్తుచేసే ప్రయత్నం చేశారు. తన తండ్రి ఎలాంటి త్యాగాలు చేశాడు? ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్రను పోషించాడు? జై బోలో తెలంగాణ సినిమా నిర్మాణంలో తన తండ్రి పాత్ర ఎటువంటిది? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా.. పోరు తెలంగాణమా అనే పాటను ఎలా రచించారు? అనే విషయాలను వెన్నెల కుండబద్దలు కొట్టారు. అంతేకాదు తన తండ్రి ఎలాంటి వ్యక్తిత్వం కలవాడో అందరికీ తెలుసని వెన్నెల పేర్కొన్నారు. గద్దర్ పై బండి సంజయ్ విమర్శ చేసిన ఒక రోజు తర్వాత వెన్నెల రెస్పాండ్ అయ్యారు. మొత్తానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించారు.
కౌంటర్ ఇచ్చిన బిజెపి నాయకులు
వెన్నెల చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు కూడా అదే స్థాయిలో స్పందించారు.. భారతీయ జనతా పార్టీ నాయకులను గద్దర్ పొట్టన పెట్టుకున్నాడని.. గద్దర్ శరీరంలో బుల్లెట్లు దించింది ఎవరో అందరికీ తెలుసని.. ఇవాళ వెన్నెల ఇలా మాట్లాడగానే అబద్ధాలు నిజాలు అయిపోవని పేర్కొన్నారు..”గద్దర్ చేసిన ఉద్యమాల వల్ల ఏం జరిగిందో అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను అంతమొందించడంలో గద్దర్ పాత్ర ఉన్నది. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఎలా ఇస్తారు? ఆ వ్యక్తి భావజాలం ఎలాంటిదో అందరికీ తెలుసు కదా! అలాంటప్పుడు అతడికి పద్మశ్రీ అవార్డును ఎందుకు ఇవ్వాలి? ఏదో లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. అయన అంతమాత్రాన కేంద్రం గుడ్డిగా అవార్డులు ఎందుకు ఇస్తుంది? గద్దర్ భావజాలం తెలిసి కూడా అవార్డులు ఇవ్వడం అంటే మూర్ఖత్వం కాదా.. ఈ విషయం వెన్నెలకు తెలియనట్టుందని” భారతీయ జనతా పార్టీ నాయకులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. నిన్న బండి సంజయ్.. నేడు వెన్నెల.. విమర్శ, ప్రతి విమర్శలు చేసుకున్నారు. మరి రేపటి నాడు ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది..
గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన గద్దర్ కుమార్తె వెన్నెల
పదవుల కోసమో, డబ్బు కోసమో, అవార్డుల కోసమో గద్దర్ పని చేయలేదు
తెలంగాణ కోసం, పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం గద్దర్ పోరాడారు
శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని కూడా ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి గద్దర్
మీరు… pic.twitter.com/kBeHZFiET8
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2025