Vishnupriya: విష్ణుప్రియ భీమినేని సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇంస్టాగ్రామ్ లో ఆమెను లక్షల మంది ఫాలో అవుతున్నారు. విష్ణుప్రియ కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. ఆమె అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. కామెడీ వీడియోలతో కూడా పాప్యులర్ అయ్యారు. పోవే పోరా షోతో ఆమెకు బ్రేక్ వచ్చింది. సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ కలిసి హోస్ట్ చేసిన పోవే.. పోరా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయ్యింది.
ఈ యూత్ఫుల్ షోలో విష్ణుప్రియ తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. ఆ విధంగా విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దయ అనే వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ కీలక రోల్ దక్కించుకుంది. లేడీ జర్నలిస్ట్ రోల్ లో ఆకట్టుకుంది. దయ సిరీస్ కి పార్ట్ 2 కూడా ప్రకటించారు. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 8లో విష్ణుప్రియ పాల్గొన్న సంగతి తెలిసిందే. విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.
విష్ణుప్రియ గేమ్ మీద కంటే.. కంటెస్టెంట్ పృథ్వితో సహచర్యం చేయడం పైనే దృష్టి పెట్టింది. విష్ణుప్రియ కనీసం ఫైనల్ కి వెళ్లలేకపోవడం కొసమెరుపు. 14 వారాలు హౌస్లో ఉన్న విష్ణుప్రియ రెమ్యూనరేషన్ పరంగా గట్టిగా రాబట్టినట్లు సమాచారం. రూ. 50 లక్షలు పైనే ఆమె తీసుకున్నారట. చెప్పాలంటే విష్ణుప్రియ కెరీర్లో సెటిల్ అయ్యింది. అయితే ఒకప్పుడు ఆమె చాలా కష్టాలు పడ్డారట. చివరికి తిండి కూడా లేక ఆకలితో అలమటించారట. అందుకే ఒకప్పటి టీవీ షోలలో విష్ణుప్రియ చాలా సన్నగా కనిపిస్తారట.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన విష్ణుప్రియకు వాళ్ళ తాతయ్య భగవద్గీత శ్లోకాలు నేర్పాడట. డిగ్రీ చదువుకునే రోజుల్లో భగవద్గీత శ్లోకాలు ట్యూషన్ గా చెప్పి ఖర్చులకు అవసరమైన డబ్బులు సంపాదించేదట. అలా విష్ణుప్రియ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందట. ప్రస్తుతం విష్ణుప్రియ నటనపై ఎక్కువ దృష్టి పెట్టారు.