ఎస్పీ పేరిట టోకరా: నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లతో దందా!

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సైబర్‌‌ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు  సైబర్ దొంగల‌‌ బారిన పడొద్దని చెబుతున్నా ప్రజలు మాత్రం వారిని నమ్ముతూనే ఉన్నారు. ఎప్పుడూ బ్యాంకు అధికారుల పేరుతో అమాయకులకు ఫోన్లు చేసి.. ఓటీపీలు తెలుసుకుని లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. కొత్తగా ఏకంగా ఓ ఎస్పీ నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో అమాయకులను అడ్డంగా దోచుకోవడం మొదలుపెట్టారు. ఫేస్‌బుక్‌లో పోలీసు ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి.. ‘అర్జెంటుగా డబ్బులు కావాలి’ అంటూ […]

Written By: NARESH, Updated On : September 19, 2020 2:00 pm

fake facebook

Follow us on

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సైబర్‌‌ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు  సైబర్ దొంగల‌‌ బారిన పడొద్దని చెబుతున్నా ప్రజలు మాత్రం వారిని నమ్ముతూనే ఉన్నారు. ఎప్పుడూ బ్యాంకు అధికారుల పేరుతో అమాయకులకు ఫోన్లు చేసి.. ఓటీపీలు తెలుసుకుని లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. కొత్తగా ఏకంగా ఓ ఎస్పీ నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో అమాయకులను అడ్డంగా దోచుకోవడం మొదలుపెట్టారు. ఫేస్‌బుక్‌లో పోలీసు ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి.. ‘అర్జెంటుగా డబ్బులు కావాలి’ అంటూ వారి బంధుమిత్రులను మోసగిస్తున్నారు.

Also Read: తెలంగాణ.. ఓ గొప్ప విజయం!

నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ కొన్ని నెలల క్రితమే ఫేస్‌బుక్‌కు గుడ్‌బై చెప్పారు. కానీ.. సైబర్‌‌ నేరగాళ్లు మాత్రం ఆయన ఫొటోలతో ఓ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేశారు. నల్లగొండతోపాటు పలు జిల్లాలకు చెందిన ప్రముఖులు, ఉద్యోగులు, సామాన్యులకు ఎస్పీ పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతున్నారు. ఇక వారు కూడా అబ్బో పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌‌ కదా.. ఆ స్థాయి ఆఫీసర్‌‌ రెక్వెస్ట్‌ పంపించారంటూ వెంటనే కన్‌ఫాం కొట్టేస్తున్నారు.

ఆ తర్వాత వారితో చాటింగ్‌ చేయడం ప్రారంభిస్తున్నారు. ‘అర్జంటుగా రూ.20 వేలు కావాలి.. సర్దుబాటు చేస్తారా..? రేపు ఇచ్చేస్తాను. నా భార్య ఫోన్‌పే/గూగుల్‌పేకు డబ్బు పంపండి’ అంటూ చాటింగ్‌లో కోరుతున్నారు. దీంతో జిల్లా ఎస్పీనే అడుగుతున్నారనుకొని ఆ అమాయకులు వెంటనే ఆలోచించకుండా డబ్బులు పంపించారు. ఇటీవల ఎస్పీ మిత్రడొకరు ‘సార్‌ మీరు పంపిన నంబరుకు డబ్బులు పంపాను’ అంటూ డైరెక్ట్‌గా ఎస్పీకే ఫోన్‌ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంతకుముందు ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి విషయంలోనూ ఇలాంటి మోసమే జరిగింది. ఇప్పుడూ అలానే జరగడంతో నల్లగొండ సైబర్‌‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఆ సైబర్‌ నేరగాళ్లు ఒడిసాకు చెందిన ఓ మహిళ ఖాతా ద్వారా నగదు సేకరించినట్లు గుర్తించారు. ఇంకా నిందితులైతే పట్టుబడలేదు.

Also Read: దుబ్బాకలో రఘునందన్‌రావుకు సింపతి కలిసొచ్చేనా

ఇలాంటి నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లు.. నకిలీ ఫోన్లను నమ్మి ఎవరూ మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.పోలీసు అధికారుల పేరుతో ఫ్రెండ్‌ రెక్వెస్ట్‌ వచ్చినా..  అతిగా చాటింగ్‌ చేస్తున్నా అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సైబర్‌క్రైమ్‌ పోలీసుల హెల్ప్‌లైన్‌ నంబరు 155260కు ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు.