https://oktelugu.com/

సొమ్ము స్వాహా: రైతుల కంట్లో సహ‘కారం’

ఎండనక.. వాననక.. చలి అనక.. రాత్రి పగలు తేడా లేకుండా.. 24/7 అంటూ కష్టపడి ఇంతోఅంతో పోగు చేసుకున్న రైతుల డబ్బులను గద్దల్లా తన్నుకుపోయారు. డిపాజిట్లను దోచుకున్నారు. ఫేక్‌ బాండ్‌ పేపర్లు ఇచ్చి పైసలు డ్రా వాడేసుకున్నారు. ఒక్క రూపాయా.. రెండు రూపాయాలా.. కోట్లాది రూపాయల స్కాంకు పాల్పడ్డారు. కంచె చేను మేసినట్లుగా ఇదంత చేసింది కూడా ఆ సొసైటీ సభ్యులే. ఈ విషయం తెలుసుకున్న రైతాంగం ఇప్పుడు లబోదిబోమంటోంది. Also Read: కేంద్రం వ్యవసాయ సంస్కరణలు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 01:37 PM IST

    frauad in farmers

    Follow us on


    ఎండనక.. వాననక.. చలి అనక.. రాత్రి పగలు తేడా లేకుండా.. 24/7 అంటూ కష్టపడి ఇంతోఅంతో పోగు చేసుకున్న రైతుల డబ్బులను గద్దల్లా తన్నుకుపోయారు. డిపాజిట్లను దోచుకున్నారు. ఫేక్‌ బాండ్‌ పేపర్లు ఇచ్చి పైసలు డ్రా వాడేసుకున్నారు. ఒక్క రూపాయా.. రెండు రూపాయాలా.. కోట్లాది రూపాయల స్కాంకు పాల్పడ్డారు. కంచె చేను మేసినట్లుగా ఇదంత చేసింది కూడా ఆ సొసైటీ సభ్యులే. ఈ విషయం తెలుసుకున్న రైతాంగం ఇప్పుడు లబోదిబోమంటోంది.

    Also Read: కేంద్రం వ్యవసాయ సంస్కరణలు.. ఎవరికీ లాభం?

    ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం బ్రాహ్మణపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌)లో ఈ మోసం జరిగింది. రైతుల ఆందోళనలతో ఖమ్మం డీసీసీబీ మేనేజర్‌ మధులిక సొసైటీలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీలో బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు చెందిన 800 మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. రూ.3.65 కోట్ల టర్నోవర్‌తో బ్యాంకు నడుస్తోంది. సొసైటీ లాభాల బాటలో పయనిస్తుండటంతో చిన్న, సన్నకారు రైతులతో పాటు కూలీలు కూడా డబ్బును డిపాజిట్‌ చేశారు.

    ఈ సొసైటీలో ఓ మహిళను కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌గా నియమించారు. అందరితో ఉన్న పరిచయాలతో ఆమె ఊళ్లోని కూలీలు, రైతు నుంచి డబ్బు తీసుకుంటూ బాండ్లు ఇచ్చింది. కొందరికి మాత్రం నిబంధనల మేరకు బాండ్లు ఇచ్చి వాటిని రికార్డుల్లో నమోదు చేసేది. నిరక్షరాస్యులు, మరికొందరికి మాత్రం నకిలీ బాండ్లు ఇచ్చి కంప్యూటర్‌లో నమోదు చేయలేదు. ఏళ్లుగా ఈ తతంగం నడుస్తున్నా.. సీఈవో పూర్తి నిర్లక్ష్యంగా ఉండటంతో సొసైటీలో ఏం జరుగుతుందో అర్థం కాకుండాపోయింది. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారగా.. రెండు సంవత్సరాల క్రితం పూర్తి కావాల్సిన ఆడిట్‌ గత నెలలో పూర్తయ్యింది.

    Also Read: అప్పుల కోసం ‘సలహాల’ ఒప్పందం.. జగన్ మరీ పీక్స్

    మోసపోయామని తెలుసుకున్న కొందరు రైతులు సొసైటీలో నిలదీయడంతో సీఈవో, కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌ నుంచి రూ.15 లక్షలను రికవరీ చేశారు. కానీ.. ఇంకా లక్షలాది సొమ్ము రికవరీ కావాల్సి ఉంది. దీంతో చాలా మంది రైతులు ఇంకా సొసైటీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా డీసీసీబీ ముందు రైతులు ఆందోళన చేపట్టగా.. డీసీసీబీ మేనేజర్‌ విచారణకు దిగారు. ఈ విచారణలో పలువురికి నకిలీ బాండ్లను ఇచ్చినట్లు తేలింది. అయితే సొసైటీలో డిపాజిట్లతోపాటు ఎరువుల విక్రయాలు, తదితర లావాదేవీల్లో కూడా అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. కోర్టు వివాదం కారణంగా పాలకవర్గం లేదని, పూర్తిగా సీఈవో పాలనలో ఉండటం వల్లే ఇలా జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకుని రైతుల సొమ్ముకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.