KTR: ఏపీలో వైసీపీ ఓటమిపై కేటీఆర్‌ పోస్టుమార్టం.. చివరకు తేల్చింది ఇదే

తెలంగాణలో తాము ఎందుకు ఓడామో ఏనాడూ పోస్టుమార్టం చేయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొరుగు రాష్ట్రంలో తన మిత్ర పార్టీ వైసీపీ ఓటమిపై మాత్రం పోస్టుమార్టం చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ అధికార వైసీపీ ఓటమికి ఆయన కొన్ని కారణాలు వెల్లడించారు. జగన్‌ ఘోర పరాభవంపై మాజీ మంత్రి కేటీఆర్‌ తొలిసారి నోరు విప్పారు.

Written By: Raj Shekar, Updated On : July 9, 2024 4:08 pm

KTR

Follow us on

KTR: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌.. ఏపీలో ఐదేళ్లు అధికాంరలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వరుసగా ఆరు నెలల వ్యవధిలో అధికారం కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత వాటిపై ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏనాడు పోస్టుమార్టం చేయలేదు. ఓటమికి కాంగ్రెస్‌ తప్పుడు హామీలే కారణం అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఐదేళ్లే అధికారంలో ఉన్న ఏపీలోని వైసీపీ కూడా 2024 సార్వత్రిక ఎన్నికలో గట్టి ధీమాతో దిగింది. కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనలేక చతికిలపడింది. రెండ పక్షాల మధ్య ఓట్ల తేడా పది శాతమే అయినా… కూటమి రికార్డుస్థాయిలో 164 సీట్లు గెలవగా, వైనాట్‌ 175 నినాదంతో పోటీచేసిన వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది.

వైసీపీ ఓటమిపై కేటీఆర్‌ పోస్టుమార్టం..
తెలంగాణలో తాము ఎందుకు ఓడామో ఏనాడూ పోస్టుమార్టం చేయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొరుగు రాష్ట్రంలో తన మిత్ర పార్టీ వైసీపీ ఓటమిపై మాత్రం పోస్టుమార్టం చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ అధికార వైసీపీ ఓటమికి ఆయన కొన్ని కారణాలు వెల్లడించారు. జగన్‌ ఘోర పరాభవంపై మాజీ మంత్రి కేటీఆర్‌ తొలిసారి నోరు విప్పారు. నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న కేటీఆర్, హరీశ్‌రావు మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

ఓటమి ఆశ్చర్యం గలిగించింది..
ఏపీలో అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీసీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్‌ తెలిపారు. అయితే కూటమిని ఎదుర్కొని వైసీపీ 40 శాతం ఓట్లు సాదించడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. టీడీపీ, జనసే, బీజేపీ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని తెలిపారు. ఇక ప్రతీరోజు ప్రజల్లో ఉండే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవటం బాధ కలిగించిందని పేర్కొన్నారు.

షర్మిలపై కామెంట్‌..
ఇక జగన్‌ ఓడిపోవడానికి షర్మిల కూడా ఓ కారణమని తెలిపారు. జగన్‌ను ఓడించేందుకు కూటమి షర్మిలను ఓ పావుగా వాడుకుందని వైసీపీ కార్యకర్తలా వ్యాఖ్యానించారు కేటీఆర్‌. ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమిపైనా మాట్లాడారు. ప్రజలు తమకు గ్యాప్‌ ఇచ్చారన్నారు. ప్రజలు తపుప చేశారని అనడం తమ తప్పన్నారు. ఎందుకు గ్యాప్‌ ఇచ్చారో అర్థమైందని తెలిపారు.

ఫిరాయింపులపై హరీశ్‌ వ్యాఖ్యలు..
ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమి, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు ఓడిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో అదే ఫలితం వస్తుందని పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌కు నష్టం తప్ప లాభం లేదని స్పష్టం చేశారు.