https://oktelugu.com/

Vikram Thangalaan: తంగలన్ తో హిట్ కొడితే విక్రమ్ ముందు రెండు ఆఫర్లు ఉంటాయి…

Vikram Thangalaan: తమిళ్ ఇండస్ట్రీ లో వాళ్ళకి ఎలాంటి మార్కెట్ అయితే ఉంటుందో తెలుగులో కూడా అంతకు మించిన మార్కెట్ ను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. నిజానికి విక్రమ్ లాంటి హీరో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 9, 2024 / 04:07 PM IST

    Vikram will have two offers in front of him if Thangalaan movie Hit

    Follow us on

    Vikram Thangalaan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు తమ తమ టాలెంట్ ఏంటో చూపించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంతారు. అలాగే తమిళ్ సినిమా హీరోలు కూడా తమిళ్ తో పాటు తెలుగులో కూడా వాళ్ళ స్టామినా ఏంటో చూపిస్తు చాలా సంవత్సరాల పాటు మన హీరోలతో పోటీ పడుతూ ఇక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు.

    ఇక అందులో భాగంగానే తమిళ్ ఇండస్ట్రీ లో వాళ్ళకి ఎలాంటి మార్కెట్ అయితే ఉంటుందో తెలుగులో కూడా అంతకు మించిన మార్కెట్ ను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. నిజానికి విక్రమ్ లాంటి హీరో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఆయన నార్మల్ సినిమాలు చేయడానికి అసలు ఇష్టపడడు. కెరియర్ మొదట్లో ఆయన చేసిన ‘శివ పుత్రుడు’ , అపరిచితుడు, నాన్న , ఐ లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

    నిజానికి ఆయన తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో మాత్రం ఆయనకు చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది. ఆయన సినిమాల మీద పెట్టే ఎఫర్ట్ కోసమైన తెలుగు అభిమానులు ఒక్కసారైనా ఆయన సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆయన ‘తంగలన్ ‘ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే విక్రమ్ కి తెలుగు నుంచి రెండు భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అందులో ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుండగా, ఇక యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ కూడా విక్రమ్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నారట.

    మరి ఈ రెండు ఆఫర్స్ ని అందుకోవాలంటే ఆయన తంగలన్ అనే సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందుకుంటేనే ఈ రెండు ఆఫర్లు కూడా ఆయనకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ పరంగా చూసుకున్న కూడా విక్రమ్ మీద పెట్టిన డబ్బులు తిరిగి రావాలి. అలాంటప్పుడే సినిమాని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నటన పరంగా సూపర్ అనిపించిన కూడా మార్కెట్ పరంగానే సినిమా చేసేది లెంది ఆధారపడి ఉంటుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది…