SI Praveen: స్టేషన్ కు వచ్చిన బాధితురాలితో ఆ పని.. బయట కలుద్దామంటూ వాట్సాప్ లో మేసేజ్.. ఎస్సై పై వేటు

నల్లగొండ జిల్లా శాలిగౌరారం ఎస్సై ప్రవీణ్ ను వేకెన్సీ రిజర్వ్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ ప్రవీణ్ తనను వేధించాడని ఓ మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు విచారణ నిర్వహించి పై చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఆ మహిళ ఎస్సై ప్రవీణ్ పై గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆమె మళ్ళీ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. ఆయన పై విధంగా చర్యలు తీసుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 9, 2024 4:15 pm

SI Praveen

Follow us on

SI Praveen: అన్యాయం జరిగినప్పుడు, తమ వ్యక్తిగత భద్రతకు భంగం కలిగినప్పుడు.. ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు. తమ సమస్యలను సంబంధిత పోలీసు అధికారులకు చెప్పుకుంటారు. వారు చేసే విచారణ ద్వారా న్యాయం పొందుతారు. కానీ, ఓ బాధ్యత గల ఎస్సై ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. న్యాయం కోసం వచ్చిన బాధితురాలి పట్ల నీచంగా ప్రవర్తించాడు.. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆ ఎస్సై శాఖాపరమైన చర్యలకు గురయ్యాడు.

నల్లగొండ జిల్లా శాలిగౌరారం ఎస్సై ప్రవీణ్ ను వేకెన్సీ రిజర్వ్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ ప్రవీణ్ తనను వేధించాడని ఓ మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు విచారణ నిర్వహించి పై చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఆ మహిళ ఎస్సై ప్రవీణ్ పై గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆమె మళ్ళీ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. ఆయన పై విధంగా చర్యలు తీసుకున్నారు..

తన సమస్య నిమిత్తం ఓ మహిళ శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఎస్ఐకి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఎస్ఐ ప్రవీణ్ ఆమెతో టీ పెట్టించాడు. టీ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చాడు. ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని..”టీ బాగా పెట్టావు. చికెన్ ఫ్రై, చేపల ఫ్రై బాగా చేస్తావా? అలా చేస్తే బయట ఎక్కడైనా కలుద్దామంటూ” ఫోన్ చేసి వేధించాడు. వాట్సాప్ లో మేసేజ్ లు చేశాడు.

విచారణ పేరుతో గంటసేపు తన రూమ్ లో నిల్చోబెట్టి నానా మాటలు అన్నాడు. ఏదైనా విషయం ఉంటే తనకు పర్సనల్ గా ఫోన్ చేయాలని వ్యక్తిగతమైన నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ విషయాలు బయట చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అంతేకాదు కుల సంఘాల నేతలతో దుష్ప్రచారం చేయించాడని బాధితురాలు పేర్కొన్నది. దీంతో ఎస్పీ సంబంధిత సిబ్బందితో విచారణ నిర్వహించగా.. ఆ బాధితురాలు పేర్కొన్న విషయాలన్నీ నిజమని తేలింది. దీంతో ఆయన శాఖా పరమైన చర్యలకు ఉపక్రమించారు. ఆ ఎస్ ఐ ని వేకెన్సీ రిజర్వ్ కు పంపించారు.