పరువు హత్య: కూతురు పెళ్లి చేసుకుందని తండ్రి దారుణం

మానవత్వం రోజుకురోజుకు కనుమరుగవుతోంది. పిల్లలను తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన పెద్దలే పంతాలకు పోయి హత్యలకు పాల్పడుతుండటం శోచనీయంగా మారింది. కూతురు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందనే కారణంతో యువతి తండ్రి ఆమె భర్తను(అల్లుడి) పాశవికంగా హత్య చేయించడం సంచలనంగా మారింది. తెలంగాణలోని మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య మరువక ముందే భాగ్యనగరంలో మరో పరువు హత్య కలకలం రేపింది. హైదరాబాద్ లోని చందానగర్ లో హేమత్ అనే యువకుడి నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ […]

Written By: NARESH, Updated On : September 25, 2020 1:14 pm

murderd

Follow us on


మానవత్వం రోజుకురోజుకు కనుమరుగవుతోంది. పిల్లలను తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన పెద్దలే పంతాలకు పోయి హత్యలకు పాల్పడుతుండటం శోచనీయంగా మారింది. కూతురు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందనే కారణంతో యువతి తండ్రి ఆమె భర్తను(అల్లుడి) పాశవికంగా హత్య చేయించడం సంచలనంగా మారింది.

తెలంగాణలోని మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య మరువక ముందే భాగ్యనగరంలో మరో పరువు హత్య కలకలం రేపింది. హైదరాబాద్ లోని చందానగర్ లో హేమత్ అనే యువకుడి నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ఈ యువజంట కొద్దిరోజులుగా చందానగర్లోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కాపురం సాఫీగా జరుగుతోంది.

యువతి తండ్రికి మాత్రం హేమంత్ ను తన కూతురు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. ఈక్రమంలోనే హేమంత్ మిస్సయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు హేమంత్ మిస్సింగ్.. కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. నిన్ని కొండాపూర్ శివార్లోని కిష్టాయగూడెంలో గుర్తుతెలియని మృతదేహం పోలీసులకు లభించింది.

గచ్చిబౌలిలో మిస్సింగ్ కేసుకు కొండపూర్ శివార్లలోకి చెట్లపొదల్లో దొరికిన మృతదేహానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హేమంత్ హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు మృతదేహానికి హైదరాబాద్ కు తరలించారు. కిష్టాయిగూడెంలో దొరికిన ఆధారాలతో సంగారెడ్డి క్లూస్ టీం నిందితుల వివరాలను సేకరించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని తండ్రి కిరాయి హంతకులతో హేమంత్ కిడ్నాప్ చేసి హత్య చేయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వరుసగా పరువు హత్యలు వెలుగు చూస్తుండటంతో ప్రతీఒక్కరిలో భయాందోళన నెలకొంది. కూతురు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని తండ్రి కక్ష్య పెంచుకొని అల్లుడిని హత్య చేయించడాన్ని ప్రతీఒక్కరు తప్పుబడుతున్నారు.

క్షణికావేశంలో చేసే పనులతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ప్రేమ-పెళ్లిళ్లు.. పరువు హత్యలపై యువతీ యువకులకు పోలీసులు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.