బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు ఇండస్ట్రీలోని ప్రముఖులను ఇరుకునపెడుతోంది. ఈ కేసులో డ్రంగ్స్ లింకులు బయటపడటంతో సీబీఐ, ఎన్సీబీ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక ట్వీస్టులతో ముందుకెళుతోంది.
పోలీసుల దర్యాప్తులో ఇటవల కొన్ని వాట్సాప్ సందేహాలు లభించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ల మధ్య, డ్రగ్స్ డీలర్ల మధ్య జరిగిన ఛాటింగులు ఈ కేసులో కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వాట్సాప్ సెక్యూరిటీపై పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ ను మనం తెరిచి సందేశాలను పంపినప్పుడల్లా.. ‘ఈ చాట్ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అండ్ సేఫ్’ అనే పంక్తులను చూపుతుంది. కాగా రియా చక్రవర్తి స్క్రీన్ షాట్స్.. టాలెంట్ మేనేజర్ తో చాట్ చేసిన వైనం.. ‘మాల్’ సంపాదించడంపై టాలెంట్ మేనేజర్ తో దీపికా పదుకొనే చాట్ చేయడం వంటివి బయటికి వచ్చాయి. సెలబ్రిటీల స్క్రీన్ షాట్స్.. చాట్ డేటాను మీడియాకు ఎలా లభిస్తున్నాయనే అనుమానాలు ప్రతీఒక్కరికి కలుగుతున్నాయి.
విచారణలో భాగంగా ఎన్ఐఏ, ఎన్సీబీలు మాత్రమే సెలబ్రెటీల ఫోన్లను క్లోజ్ చేసి సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఒక మీడియాకుగానీ.. సామాన్యుడికిగానీ వాట్సాప్ ఛాటింగులు బయటికి తీసుకురావడం సాధ్యంకాదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దీంతో వాట్సాప్ ఛాటింగులు సురక్షితమేగానీ చట్టాలు ఉల్లంఘించినపుడు దర్యాప్తు సంస్థలు వీటిని సాక్ష్యాలుగా ఉపయోగించే వీలుంటుదట.
వాట్సాప్ ఛాటింగులను సేకరించి సాక్ష్యాలుగా ఉపయోగించుకునే అధికారం దర్యాప్తు సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. చట్టాలు ఉల్లంఘించే వారి ఛాటింగులను మాత్రమే ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు సేకరిస్తాయని అందువల్ల వ్యక్తిగత వినియోగదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.