Farooqnagar crime news: మూడు సంవత్సరాల పాప అమ్మా అమ్మా అంటూ ఏడుస్తోంది. పైగా ఆ ప్రాంతం నిర్జనమైన ప్రదేశం.. ఆ పాప ఎంత ఏడ్చినప్పటికీ.. ఆమె తల్లి నిర్జీవంగా పడి ఉంది. రాత్రి మొత్తం ఆ పాప అలానే ఏడ్చింది. చుట్టుపక్కల వారు ఆ పాప ఏడుపు విని పోలీసులకు సమాచారం అందించారు.
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం దేవుని పల్లి పరిధిలోని రంగారెడ్డిగూడ లో ఈ సంఘటన జరిగింది. రంగారెడ్డి గూడ ప్రాంతానికి చెందిన శోభ (31) కు 10 సంవత్సరాల క్రితం పాలమూరు జిల్లా కోయిలకొండ ప్రాంతాన్ని చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. శోభకు ఏడు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. భర్తతో గొడవలు రావడంతో మూడున్నర సంవత్సరాల క్రితం విడిపోయింది.
నరసింహులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఒక పాపకు జన్మనిచ్చింది. అయితే నర్సింహులతో కూడా గొడవలు రావడంతో పుట్టింటికి వచ్చింది. తన తల్లితో కలిసి ఉంటున్నది. ఈ క్రమంలో నర్సింహులు శోభకు ఫోన్ చేశాడు. “నీ కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని” చెప్పాడు. దీంతో శోభ తన కుమారుడితో కలిసి నరసింహులు చెప్పిన ప్రాంతానికి వెళ్ళింది. అయితే నరసింహులు అక్కడికి రాకపోవడంతో ఆమె కోయిలకొండ ప్రాంతానికి వెళ్లిపోయింది.
శోభ అక్కడికి వెళ్లిన తర్వాత.. చనిపోయింది. రంగారెడ్డి గూడా శివారు ప్రాంతంలో శోభ చనిపోయింది. ఆమె తలపై బండ రాగితో కొట్టిన ఆనవాళ్ళు కనిపించాయి. పోలీసుల దర్యాప్తులో ఈ కేసు కు సంబంధించి కీలక విషయాలు వెలుగు చూశాయి.
శోభతో సహజీవనం చేసిన వ్యక్తి ఆమెను చంపేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత శోభ మృతదేహాన్ని బస్తాలో కుక్కి.. ద్విచక్ర వాహనం మీద ముందు భాగంలో పెట్టుకొని.. చిన్నారితో కలిసి వెళ్లినట్టు తెలుస్తోంది. బైక్ మీద దాదాపు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించి.. రంగారెడ్డిగూడెం శోభ మృతదేహాన్ని పడవేసినట్టు తెలుస్తోంది.