Homeటాప్ స్టోరీస్Seven Wells Waterfall in Telangana: పాండవులు నడయాడిన ప్రాంతం అది.. ఈ వర్షాకాలంలో నయాగారాను...

Seven Wells Waterfall in Telangana: పాండవులు నడయాడిన ప్రాంతం అది.. ఈ వర్షాకాలంలో నయాగారాను తలపిస్తుంది..

Seven Wells Waterfall in Telangana: చుట్టుకొండలు.. దట్టమైన వృక్షాలు.. సెల్ఫోన్ సిగ్నల్ ఉండదు. చూద్దామన్నా ఒక్క మనిషి కూడా కనిపించడు. ఒక రకంగా ఆ ప్రాంతం దుర్భేద్యమైనది. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రకృతి రమణీయతకు.. అందానికి ఆ ప్రాంతం పెట్టింది పేరు.. అయితే ఆ ప్రాంతం వెనుక గొప్ప చరిత్ర ఉంది. ప్రస్తుతం వర్షాలు మెండుగా కురుస్తుండడంతో నిండుగా నీళ్లతో పారుతోంది..

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఏడు బావుల పేరుతో ఒక జలపాతం ఉంటుంది. ఈ జలపాతంలో నీళ్లు కొబ్బరినీళ్ళ కంటే తీయగా ఉంటాయి. అన్నింటికీ మించి ఈ జలపాతంలో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి. వర్షాకాలంలో ఈ జలపాతం నయాగారాను తలపిస్తుంది. అంత ఎత్తున నుంచి వచ్చే నీళ్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. చుట్టుకొండలు.. మధ్యలో నుంచి జలపాతం జాలువారడం కనులవిందు చేస్తుంది. ప్రస్తుతం బీభత్సంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఏడు బావుల జలపాతం ఉరకలెత్తుతోంది. పర్యాటకుల రాకతో సందడిగా మారింది. అయితే ఈ ఏడు బావుల జలపాతానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది.

Also Read: గత ఏడాది మేడారంలో.. ఈసారి ఈ ప్రాంతాలలో.. ప్రకృతి ఏదో చెబుతోంది!

ఏడు బావుల జలపాతం అనేది ఒక సముదాయం లాంటిది. ఇక్కడికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాలి. కాలినడకన చాలా దూరం నడవాలి. బయ్యారం మండల కేంద్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. రోడ్డు మార్గం సరిగా లేకపోవడం వల్ల 12 కిలోమీటర్లు కాస్త 50 కిలోమీటర్ల దూరం లాగా అనిపిస్తుంది. 7 బావుల జలపాతం పాండవుల వల్ల ఏర్పడిందని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. పూర్వకాలంలో పాండవులు ఈ ప్రాంతంలో ఉన్నారని.. దాహం తీర్చుకోవడానికి అప్పటికప్పుడు ఈ జలపాతాన్ని ఏర్పాటు చేసుకున్నారని.. అందువల్లే ఈ జలపాతం ఏడు బావులగా పేరొందిందని చెబుతుంటారు. ఏడుపాయలుగా చీలిపోయిన ఈ జలపాతం చివరికి కలిసిపోతుందని.. అందువల్లే ఈ ప్రాంతాన్ని ఏడూ బావుల అని పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ జలపాతం వర్షాకాలం ఉధృతంగా ప్రవహిస్తుంది. నవంబర్ నెల వరకు దీని ప్రవాహం ఇదే స్థాయిలో ఉంటుంది. నవంబర్ తర్వాత ప్రవాహస్థాయి తగ్గిపోయినప్పటికీ నీరు మాత్రం వస్తూనే ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యటకులు భారీగా వస్తుంటారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తుంటారు. ఇక ఈ చుట్టుపక్కల గ్రామదేవతలు కొలువై ఉన్నారు. ఆదివారం ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు మొక్కలు తీర్చుకొని.. కుటుంబ సభ్యులతో సరదాగా భోజనాలు చేస్తుంటారు. ఈ ప్రాంతం పర్యాటకంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో.. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏడు బావుల జలపాతంతో పాటు.. బయ్యారం పెద్ద చెరువును కూడా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా రూపొందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఒకవేళ ఈ ప్రాంతాలు గనుక అభివృద్ధి చెందుతాయి పర్యాటకంగా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version