https://oktelugu.com/

Konda Surekha :  కొండా సురేఖ కామెంట్స్.. దెబ్బకు హైడ్రా సహా అన్ని కొట్టుకుపోయాయి

నిన్నటి నుంచి సోషల్ మీడియా, మీడియాలు సైతం ఇదే వార్తను ఫోకస్ చేస్తూ వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతోపాటు అటు సినీ ఇండస్ట్రీ నటీనటులు, పెద్దల స్టేట్‌మెంట్లతో రచ్చరచ్చ నడుస్తోంది. ఇదంతా ఇలా నడుస్తుంటే.. మొన్నటివరకు పెద్ద ఎత్తున హైడ్రా దుమారం ఇప్పుడు కనిపించకుండా పోయింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 3, 2024 / 03:22 PM IST

    Konda Surekha-KTR

    Follow us on

    Konda Surekha :  కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియా రెచ్చిపోవడంతో.. నిన్న గాంధీ జయంతి వేడుకగా సురేఖ మరింత రెచ్చిపోయారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరింత ఆడేసుకున్నారు. డ్రగ్స్‌కు కేటీఆర్‌కు ముడిపెడుతూ పెద్ద స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే.. నాగచైతన్య-సమంతలు విడిపోవడానికి కారణం కూడా కేటీఆరేనని పెద్ద బాంబ్ పెల్చారు. నిన్నటి నుంచి ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే నడుస్తోంది. ఇటు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ అంశంలో ఏకం అయ్యారు.

    మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలోని పెద్దలంతా దాదాపు స్పందించారు. ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. అటు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. మెగాస్టార్ చిరంజీవి, నాని, ప్రకాశ్ రాజ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మంత్రి వ్యాఖ్యలపై వారు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉన్న తమను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. మరికొందరు అయితే వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. ఇక.. ఈ ఎపిసోడ్‌పై నిన్ననే అటు నాగార్జున, అతని భార్య అమల, నాగచైతన్య, సమంత కూడా స్పందించారు. తాము వ్యక్తిగత కారణాలతోనే విడిపోయామని.. తమ విడాకులకు ఎటువంటి రాజకీయ అంశాలు లేవని సమంత క్లారిటీ ఇచ్చారు. ఇక నాగార్జున మాత్రం.. తమ వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.

    నిన్నటి నుంచి సోషల్ మీడియా, మీడియాలు సైతం ఇదే వార్తను ఫోకస్ చేస్తూ వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతోపాటు అటు సినీ ఇండస్ట్రీ నటీనటులు, పెద్దల స్టేట్‌మెంట్లతో రచ్చరచ్చ నడుస్తోంది. ఇదంతా ఇలా నడుస్తుంటే.. మొన్నటివరకు పెద్ద ఎత్తున హైడ్రా దుమారం ఇప్పుడు కనిపించకుండా పోయింది. మూసీ బాధితులతో ఒక్కసారిగా వేడెక్కిన హైడ్రా వాతావరణం.. సురేఖ చేసిన వ్యాఖ్యల ప్రవాహంలో ఎక్కడో కొట్టుకుపోయినంత పని అయింది. ఇప్పుడు పార్టీలు కూడా ఎక్కడా హైడ్రా గురించి మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదు. వాళ్ల గురించి ఫోకస్ చేసే మీడియా కూడా లేకుండాపోయింది. ఏ మీడియాలోనూ హైడ్రాకు సంబంధించిన వార్తలు కూడా రావడం లేదు.

    మూసీ ప్రక్షాళన ఎవరి కోసం అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండడం.. మరోవైపు నేతలు పరామర్శలకు వెళ్తుండడంతో రాజకీయంగా సంచలనంగా మారింది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మూసీ నిర్వాసితులను పరామర్శించారు. ఇక హైడ్రాపై తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఒక్కసారిగా సురేఖ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇప్పుడు సురేఖ వ్యాఖ్యలు ఏకంగా ప్రభుత్వాన్నే ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో హైడ్రా గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. దాంతో హైడ్రా పనిని కూడా నిలిపివేసినట్లుగా సమాచారం. రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు ఇప్పుడు ప్రతిపక్షాలు సురేఖ వ్యాఖ్యలను అస్త్రంగా మలుచుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా కేటీఆర్ పైనే సురేఖ కామెంట్స్ చేయడంతో వారు మరింత సీరియస్‌గా తీసుకున్నారు.