Sathyam Sundaram: ‘సత్యం సుందరం’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..పెట్టిన పైసా కి 10 రెట్లు లాభం..బయ్యర్స్ కి పండగే!

నిన్న ఒక్క రోజే ఈ సినిమాకి బుక్ మై షోలో 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అలాగే పే టీఎం కూడా కలిపి చూస్తే 45 వేలకు పైగానే టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఇక తమిళ వర్షన్ వసూళ్లు కూడా చాలా బాగున్నాయి.

Written By: Vicky, Updated On : October 3, 2024 3:08 pm

Sathyam Sundaram

Follow us on

Sathyam Sundaram: ‘ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మంచి సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఇతర భాషలకు సంబంధించిన హీరోలు కూడా మన తెలుగు ఆడియన్స్ ని అమితంగా ఇష్టపడుతుంటారు. అలా మన తెలుగు ఆడియన్స్ విపరీతమైన గౌరవం ఇచ్చే తమిళ హీరోలలో ఒకరు కార్తీ. ఆయన్ని మన తెలుగు ఆడియన్స్ తమిళ హీరో గా అసలు భావించరు, తెలుగు హీరో లాగానే భావిస్తారు. అందుకే ఆయన చిత్రాలకు మన దగ్గర మంచి వసూళ్లు వస్తుంటాయి. రీసెంట్ గా ఆయన ‘సత్యం సుందరం’ అనే చిత్రం చేసాడు. ‘దేవర’ లాంటి మాస్ చిత్రం ముందు, ఇలాంటి నాన్ కమర్షియల్ సినిమాని ఎవరైనా విడుదల చేస్తారా?, విడుదలయ్యే విషయం కూడా జనాలకు తెలియకుండా థియేటర్స్ నుండి ఈ చిత్రం వెళ్ళిపోతుంది చాలా మంది అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలు తప్పు అయ్యాయి.

ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం తో ‘దేవర’ చిత్రం ప్రభావం ఈ సినిమా మీద ఇసుమంత కూడా పడలేదు. ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విడుదలై నిన్నటితో 5 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు నైజాం ప్రాంతం లో 2 కోట్ల 20 లక్షల రూపాయిలు, అలాగే ఆంధ్ర ప్రదేశ్, సీడెడ్ ప్రాంతాలకు కలిపి కోటి 75 లక్షల రూపాయిలు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 4 కోట్ల 50 లక్షల రూపాయిలు షేర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ మొత్తానికి కలిపి 2 కోట్ల రూపాయలకు జరిగింది. 5 రోజుల్లోనే రెండింతల లాభాలు వచ్చాయి, ఇక ఫుల్ రన్ లో ఎంత వరకు లాభాలను రాబడుతుందో చూడాలి. బుక్ మై షో టికెట్ యాప్ పోర్టల్ ప్రకారం ఈ సినిమాకి 5 రోజుల్లో తెలుగు వర్షన్ కి లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయాయి. నిన్న నేషనల్ హాలిడే అవ్వడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది.

నిన్న ఒక్క రోజే ఈ సినిమాకి బుక్ మై షోలో 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అలాగే పే టీఎం కూడా కలిపి చూస్తే 45 వేలకు పైగానే టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఇక తమిళ వర్షన్ వసూళ్లు కూడా చాలా బాగున్నాయి. తమిళనాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 5 రోజులకు కలిపి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే నార్త్ అమెరికా లో తెలుగు + తమిళ వేశాం కి కలిపి 5 రోజులకు 4 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.