Kishan Reddy: తెలంగాణ ఎన్నికల్లో కిషన్ రెడ్డి పోటీచేయనిది అందుకేనట?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆ తరువాత హుస్నాబాద్ లో జరిగిన సభలో.. ఆ తరువాత భీ పాంలు కూడా ఇచ్చేశారు.

Written By: Chai Muchhata, Updated On : October 24, 2023 11:20 am

Kishan Reddy

Follow us on

Kishan Reddy: తెలంగాణలో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన తరువాత ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఈ లిస్టులో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యే అభ్యర్థులగా మారారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి వెంటనే టికెట్లు వచ్చాయి. ఇప్పుడున్న ప్రకారమైతే టికెట్ ఆశించి భంగపడ్డవారు ఉన్నామని ఎవరూ అనడం లేదు. దీంతో బీజేపీ నుంచి టికెట్ రాకున్నా పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని కొందరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల పేర్లు ఫస్ట్ లిస్టులో కనిపించడం లేదు. కొందరు నేతలు చెబుతున్న ప్రకారం వీరు పోటీకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పోటీ నుంచి తప్పుకుంటుననారని చెబుతున్నారు. కిషన్ రెడ్డి పోటీకి దూరంగా ఉండడానికి కారణం వేరే ఉందన్న వార్తలు వస్తున్నాయియి.

తెలంగాణలో మొన్నటి వరకు బీజేపీ పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. ఒక దశలో అధికార పార్టీని ఢీకొట్టేది బీజేపీ మాత్రమే అనే స్థితికి వచ్చింది. కొందరు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి మారుతారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ తరువాత పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ని మార్చిన తరువాత ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. బీజేపీ లో ఉన్న ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయింది. మొన్నటి వరకు పార్టీలో అంతా ఒక్కతాటిపై నడిచిన వారు ఇప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. గతంలో పార్టీ టికెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన వారు ఇప్పుడు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆ తరువాత హుస్నాబాద్ లో జరిగిన సభలో.. ఆ తరువాత భీ పాంలు కూడా ఇచ్చేశారు. కానీ బీజేపీ మాత్రం అక్టోబర్ 22న చాలా ఆలస్యంగా ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. అప్పటి వరకు అభ్యర్థులపై ఢిల్లీ స్థాయిలో మేధోమథనం చేసి పేర్లు ప్రకటించారు. అయితే ఇందులో గతంలో పార్టీలో కొనసాగిన వారికంటే కొత్తగా వచ్చిన వారికి టికెట్లు రావడం విశేషం. బీజేపీలో సీనియర్లకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారన్న సాంప్రదాయం ఉంది. కానీ ఈసారి వ్యక్తులను అంచనావేసి టికెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

బీజేపీ ఫస్ట్ లిస్టులో మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి సంజయ్ కు కరీంనగర్ కేటాయించారు. మరో ఇద్దరు ఎంపీలు అర్వింద్ కు కోరుట్ల, సోయం బాపూరావుకు బోథ్ ను కేటాయించారు. అయితే కిషన్ రెడ్డి పేరు మాత్రం ప్రకటించలేదు. కిషన్ రెడ్డి పేరు లేకపోవడంపై రకరకాల చర్చలు ఆసక్తిని రేపుతోంది. తన నియోజకవర్గం అంబర్ పేట నుంచి ఆయన పోటీ చేసేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.

అంబర్ పేటలో ఈసారి ఎంఐంఎం పోటీ చేస్తుందన్న ప్రచారం సాగింది. ఒకవేళ అలా జరిగితే బీజేపీకి లాభం చేకూరుతుంది. కానీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా బీఆర్ఎస్ పోటీ చేస్తే గంపగుత్తగా ఆ పార్టీకే ఓట్లు పడే అవకాశం ఉంది. దీంతో ముస్లిం ఓట్లు బీజేపీకి పడే అవకాశం లేదు. దీంతో గెలుపు కొంటే ఓటమి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి పదవిలో ఉండి ఓడిపోతే బాగోదు అన్న ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు. పార్టీ నాయకులు మాత్రం ఇతరులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను పోటీలో ఉండడం లేదని చెబుతున్నారు.