https://oktelugu.com/

Subhashree Bigg Boss 7: బిగ్ బాస్ శుభశ్రీకి బంపర్ ఆఫర్.. ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్.. పారితోషికం ఎంతంటే?

కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ ఈమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు. శుభశ్రీకి దగ్గరవ్వాలని ట్రై చేస్తూ ఉండేవాడు. శుభశ్రీ కూడా మనోడు అంటే ఇంట్రెస్ట్ చూపించింది. అయితే హద్దులు దాటలేదు. హగ్గులు, ముద్దులు వంటి జోలికి పోలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2023 / 11:26 AM IST

    Subhashree Bigg Boss 7

    Follow us on

    Subhashree Bigg Boss 7: బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు గోల్డెన్ ఛాన్స్ పట్టేసింది. ఏకంగా ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాత్రకు ఎంపికైంది. దాంతో ఆమె ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. ఒరిస్సా అమ్మాయి అయిన శుభశ్రీ హీరోయిన్ కావాలని హైదరాబాద్ వచ్చింది. ఈమె లాయర్ కూడాను. అయితే నటనపైనే దృష్ఠి పెట్టింది. బిగ్ బాస్ తెలుగు 7లో శుభశ్రీకి అవకాశం వచ్చింది. హౌస్లో శుభశ్రీ తన మార్క్ చూపించింది. తనలోని రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించింది.

    కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ ఈమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు. శుభశ్రీకి దగ్గరవ్వాలని ట్రై చేస్తూ ఉండేవాడు. శుభశ్రీ కూడా మనోడు అంటే ఇంట్రెస్ట్ చూపించింది. అయితే హద్దులు దాటలేదు. హగ్గులు, ముద్దులు వంటి జోలికి పోలేదు. అనూహ్యంగా శుభశ్రీ 5వ వారం ఎలిమినేట్ అయ్యింది. అయితే శుభశ్రీకి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దామిని, శుభశ్రీ, రతిక రోజ్ లలో ఎవరు తిరిగి హౌస్లోకి రావాలని హౌస్ మేట్స్ ఓట్లు వేశారు. ఓటింగ్ ముగిశాక… తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు.

    దాంతో తిరస్కరించబడిన రతిక రోజ్ ఇంట్లో అడుగు పెట్టింది. మెజారిటీ ఓట్లు వచ్చిన వాళ్ళను తీసుకుంటే ఖచ్చితంగా శుభశ్రీ హౌస్లోకి వెళ్ళేది. అక్కడ ఛాన్స్ మిస్ అయినా ఇక్కడ బంపర్ ఆఫర్ పట్టేసింది శుభశ్రీ. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ లో శుభశ్రీ ఓ పాత్ర చేస్తుంది. ఈ మేరకు శుభశ్రీ స్వయంగా వెల్లడించింది. ఓజీ సెట్స్ లో దర్శకుడు సుజీత్ తో దిగిన ఫోటో షేర్ చేసింది. ఓజీ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన పవన్, సుజీత్ లతో పాటు నిర్మాతలకు ఆమె ధన్యవాదాలు తెలియజేసింది.

    ఓజీ మూవీలో శుభశ్రీ పాత్ర కొంచెం కీలకమే అంటున్నారు. ఓజీ చిత్రానికి శుభశ్రీ రూ. 5 నుండి 7 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. పవన్ కళ్యాణ్ సినిమాలకు విపరీతమైన రీచ్ ఉంటుంది. కాబట్టి చిన్న పాత్రలు చేసిన వాళ్ళకు కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. సుజీత్ ఓజీ చిత్రాన్ని పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మించారు.