RS Praveen Kumar: ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్.. నిన్నటి వరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. కేసీఆర్ పాలనను వ్యతిరేకించి ఐపీఎస్ పదవిని వదులుకున్నాడు. బహుజనవాదాన్ని భుజానికి ఎత్తుకుని బహుజన్ సమాజ్‌పార్టీలో చేరారు. అనతికాలంలోనే ఆ పార్టీ తెలంగాణ అధ్యోఉడు అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి తనవంతు కృషి చేశారు. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు అనూహ్యంగా బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సిద్దమయ్యారు. అయితే కేసీఆర్ నైజం తెలిసిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి బీఆర్‌ఎస్తో పొత్తును వ్యతిరేకించారు. దీంతో అధినేత్రి అభిప్రాయంతో విభేధించిన ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
రేవంత్ ఆఫర్ ఇచ్చినా..
ఇదిలా ఉంటే.. కేసీఆర్ కన్నా ముందే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు మంచి ఆఫర్ ఇచ్చాట. ఈ విషయాన్ని సీఎం స్వయంగా తెలిపారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఆదివారం నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వంద రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నించామని తెలిపారు. ప్రజలపై, ప్రతిపక్షాలపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. సామాజిక నాయ్యయం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. వంద రోజుల కాంగ్రెస్ పాలన సంతృప్తినిచ్చిందని తెలిపారు. సాగునీటి విషయంలో గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇక బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్‌కు తాను మంచి ఆఫర్ ఇచ్చానని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పానన్నారు. కానీ ఆర్‌ఎస్పీ దానిని తిరస్కరించారని, ఇంకా ఏదో చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఆర్‌ఎస్పీ బీఆర్‌ఎస్‌లో చేరతారని అనుకోవడం లేదని తెలిపారు. కేసీఆర్‌తో చేతులు కలిపితే తర్వాత ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.
నయా నిజాం కేసీఆర్..
ఇక కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడి నయా నిజాంగా అభివర్ణించారు. అందుకే నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని గుర్తుచేశారు. ధర్నా చౌక్ వద్దన్నవారే ఇప్పుడు ధర్నా చౌక్‌లో ధర్నాకు అనుమతి అడుగుతున్నారని గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడినవారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తామని తెలిపారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని తెలిపారు. గత ప్రభుత్వంలా తాము జీవోలను దాచిపెట్టమని పేర్కొన్నారు.
రైతుబంధు కొనసాగుతుంది..
ఇక యువతకు ఉద్యోగాల కల్పన ప్రథమ ప్రాధన్యతగా ఎంచుకున్నట్లు రేవంత్ తెలిపారు. వంద రోజులపాలనలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మెగా డీఎస్సీ ప్రకటించామని, టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఇక పార్టీపై ఫోకస్ పెడతామని తెలిపారు. రాష్ట్రంలో రైతుబంధు కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. సాగు అయ్యే భూములకు మాత్రమే భవిష్యత్‌లో పెట్టుబడి ఇస్తామని తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Do you know what the rs praveen kumar who rejected cm revanth offer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com