CM Revanth Reddy: కేసీఆర్‌ అహాన్ని మళ్లీ దెబ్బకొట్టిన రేవంత్‌రెడ్డి.. ఏం చేశాడో తెలుసా?

తెలంగాణలో కే సీఆర్‌ ముద్ర తొలగించడంతోపాటు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌.. గీతం ప్రకటించింది కాంగ్రెస్, తెలంగాణ తల్లికి కొత్త రూపు ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ లోగో ఆర్చింది కాంగ్రెస్‌ అనేలా సీఎం రేవంత్‌రెడ్డి మార్పులు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 1, 2024 12:16 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో జూన్‌ 2న రాష్ట్ర పదో ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో జరుగని విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతం ప్రకటించనున్నారు. పదేళ్లు అయినా రాష్ట్రానికి అధికారిక గీతం ఎంపిక చేయడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించనుంది. ఎక్కువ నిడివి ఉన్న ఆ పాటను అధికారిక కార్యక్రమాల్లో పాడుకునేలా కుదించారు. ఇక ఈ వేడుకలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

కేసీఆర్‌ టార్గెట్‌గా…
తెలంగాణలో కే సీఆర్‌ ముద్ర తొలగించడంతోపాటు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌.. గీతం ప్రకటించింది కాంగ్రెస్, తెలంగాణ తల్లికి కొత్త రూపు ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ లోగో ఆర్చింది కాంగ్రెస్‌ అనేలా సీఎం రేవంత్‌రెడ్డి మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ టార్గట్‌గా పావులు కదుపుతున్నారు. అధికారంలో ఉన్నన్నినాళ్లు అహంతో ఉన్న కేసీఆర్‌ను దెబ్బతీయడానికి రేవంత్‌ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లో కిందపడి హిప్‌ రీప్లేస్‌మెంట్‌ ఆపరేషన్‌ చేయించుకున్న కేసీఆర్‌ను చూసేందుకు సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తద్వారా కేసీఆర్‌ అహం దెబ్బతీయడంతోపాటు మంచి వాతావరణం నెలకొనేలా చేశారు. తాజాగా మరోసారి కేసీఆర్‌ అహం దెబ్బకొట్టేలా వ్యూహ రచన చేశారు.

తెలంగాణ ఆవిర్బావ వేడుకలకు..
ఈసారి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈమేరకు అధికారిక లేఖతో ఓ అధికారిని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు పంపించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి మాటగా ఆహ్వానించారు. దీంతో కేసీఆర్‌ ఇరుకున పడ్డారు. రానని చెప్పలేడు.. వస్తే వేడుకల్లో ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి ఎదుట కూర్చోలేని పరిస్థితి. దీంతో వస్తాననే చెప్పాడని అధికారి తెలిపారు. అయితే వస్తాడా అంటే అనమానమే.

అసెంబ్లీ సమావేశాలకు దూరం..
ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట కూర్చోవడం ఇష్టం లేక కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలకు రావడం లేదు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా ఎన్నికైనా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి దీనిని కూడా తనకు అనుకూలంగా వాడుకుంటన్నారు. తాజాగా తెలంగాణ వేడుకలకు ఆహ్వానించి దీనిని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే అవకావం లేకపోలేదు. వస్తే.. గత ప్రభుత్వంపై చేసే విమర్శలు వినాలి.. రాకపోతే తెలంగాణ వేడుకలకు దూరంగా ఉన్నాడన్న అపవాదు ఎదుర్కొనాల్సి ఉంటుంది. మరి కేసీఆర్‌ అహం చంపుకుని వస్తారా లేక వేడుకలకు దూరంగా ఉండి విమర్శలు ఎదుర్కొంటారా అనేది చూడాలి.