Exit Polls: ఎగ్జిట్ పోల్స్.. దేశంలో 18వ సార్వత్రిక ఎన్నికల ముగింపు దశ వేళ.. ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతున్న పదం ఇదే. దాదాపు రెండు నెలలుగా దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. 543 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 6 విడతల పోలింగ్ పూర్తయింది. ఏడో విడత శనివారం(జూన్ 1న) జరుగుతుంది. తుది విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేందుకు అనేక మీడియా, స్వచ్ఛంద సర్వే సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం సాయంత్రం 6:30 గంటల వరకూ ఎవరూ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయొద్దని ఆదేశించింది.
ఎగ్జిట్ పోల్స్ అంటే..
ఇక ఎగ్జిట్ పోల్స్ అంటే.. ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడం. ఇందుకోసం దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కొన్నేళ్లుగా మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. చాలా సంస్థలు సరైన అంచనాలతో విశ్వాసం పొందాయి. ఎన్నికల ఫలితాలు అంచనా వేయడానికి అవి ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ పోలింగ్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో వీటిని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రకటించకుండా ఎన్నికల సంఘం నిషేధించింది.
ఎగ్జిట్ పోల్ నిబంధనలు..
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126A నిస్సందేహంగా ఇలా పేర్కొంది,R.P. చట్టం 1951లోని సెక్షన్ 126A , ఎగ్జిట్ పోల్ నిర్వహించడాన్ని నిషేధిస్తుంది, అందులో పేర్కొన్న వ్యవధిలో ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాటి ఫలితాలను ప్రచారం చేయడాన్ని నిషేధిస్తుంది, అంటే గంట మధ్య. మొదటి దశలో పోలింగ్ ప్రారంభం, అన్ని రాష్ట్రాల్లో చివరి దశ పోలింగ్ ముగియడానికి సమయం నిర్ణయించిన అరగంట తర్వాత నిర్ణయించబడింది.
నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదల…
ఇదిలా ఉండగా 18వ లోక్‌సభ ఎన్నికలతోపాటు దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరిగాయి. తుది విడత పోలింగ్ శనివారం సాయంత్రం 6:30 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో సాయంత్రం అన్ని టీవీ చానెళ్లలో ఎగ్జిట్ పోల్స్ మార్మోగనున్నాయి. ఇందులో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది.. నాలుగు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనే వివరాలు ప్రకటించనున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనా మాత్రమే. ఇవే ఎగ్జాక్ట్ ఫలితాలు అయే అవకాశం లేదు. దేశంలో చాలాసార్లు ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తప్పాయి. కొన్ని సంస్థలు మాత్రం ఫలితాలకు దగ్గరాగా అంచనా వేస్తున్నాయి. మరి ఈ సారి ఏ సంస్థ అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే జూన్ 4 వరకు వేచిఉండాలి.