Lok Sabha Election 2024: కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్.. ఎలా ఉండబోతున్నాయి?

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అధికార వైసిపికి, టిడిపి కూటమికి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. గెలుపు తమదంటే తమదేనని ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి.

Written By: Dharma, Updated On : June 1, 2024 12:20 pm

Lok Sabha Election 2024

Follow us on

Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. చివరి దశ పోలింగ్ ఈరోజు జరగనుంది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్నటి వరకు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ప్రముఖ సెఫాలజిస్టులు మాత్రం మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నారు. 250 స్థానాలకు మించి రావని అంచనా వేస్తున్నారు. అనూహ్యంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కూడా ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. జూన్ 4 వరకు ఉత్కంఠ కొనసాగనుంది. అయితే ఈరోజు సాయంత్రం వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్ ప్రజల మూడ్ ను తెలియజెప్పనున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూపులు తప్పడం లేదు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అధికార వైసిపికి, టిడిపి కూటమికి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. గెలుపు తమదంటే తమదేనని ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని.. తప్పకుండా అధికారంలోకి వస్తామని వైసిపి నమ్మకంగా చెబుతోంది. ఐదేళ్ల ప్రజా వ్యతిరేక పాలన తమకు కలిసి వస్తుందని.. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నీ తమకు మద్దతు తెలపడంతో అధికారంలోకి వస్తామని టిడిపి కూటమి చెబుతోంది. పెరిగిన ఓటింగ్ తమకు కలిసి వస్తుందని ఎవరికి వారే అన్వయించుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం పై సైతం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వస్తాయి అన్నది ఆసక్తిగా మారింది.

సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ సంస్థలు క్రెడిబిలిటీకి ప్రాధాన్యమిస్తాయి. అయితే ఏపీలో ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఇవ్వాలని వైసిపి ప్రలోభ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కూటమికి అనుకూల సంకేతాలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో సైతం అదే పరిస్థితి ఉంది. దీంతో కౌంటింగ్ నాడు ఏజెంట్లు రావాలంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకూలంగా రావాలని వైసిపి భావిస్తోంది. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు ధైర్యం నూరిపోసే పనిలో వైసీపీ కీలక నేతలు ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రభావితం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే క్రెడిబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చే జాతీయ సర్వే సంస్థలు.. వైసిపి ప్రలోభాలకు లొంగే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే అటు ఇటుగా.. ఏపీ విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.