MP Asaduddin Owaisi Car: అసద్ భాయ్.. పరిచయం అక్కరలేని పేరు. పాతబస్తీని తన సామ్రాజ్యంగా మార్చకున్న నేత. హైదరాబాద్ ఎంపీ. ఎంఐఎం అధినేత. రూల్స్ అందరికీ ఒకలా ఉంటే.. పాత బస్తీలో మాత్రం మరోలా ఉంటాయి. ఉండేలా చేస్తారు అసద్. అధికారంలో ఎవరు ఉంటే.. వారితో సన్నిహితంగా ఉంటూ రూల్స్ తమకు వర్తించవు అన్నట్లుగా చేసుకుంటారు. దీంతో అసద్ అనుమతి లేకుండా పాతబస్తీలోకి పోలీసులు, ప్రభుత్వ అధికారులు అడుగు పెట్టరు. ఇక అసద్ కూడా రూల్స్‌కు తాను అతీతుడిని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ చలాన్లు కూడా చెల్లించకుండా తిరుగుతున్నారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి..
రోడ్లపై ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి జరిమానా విధిస్తున్నారు. బైక్‌లు అయితే నో హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ వంటి కారణాలతో చలాన్లు విధిస్తారు. కార్లకు అయితే ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, నోపార్కింగ్ ఏరియాల్లో పార్ చేస్తే సిగ్నల్ జంపింగ్, రాష్ డ్రైవింగ్‌కారణాలతో చలానా విధిస్తారు. దీనికి ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు అనే బేధం లేదు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కూడా పోలీసులు భారీగా చలాన్లు వేశారు.
పెండింగ్‌లోనే…
అసద్ ఉపయోగిస్తున్న వాహనం TS 11EV 9922 నంబర్ డిఫెండర్ వాహనం. దీనిపై 2021 నుంచి ఇప్పటి వరకు రూ.10,485 చలాన్లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్ల క్లియర్ కోసం రెండుసార్లు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకున్నారు. హైదరాబాద్ ఎంపీ మాత్రం తాను వాడుతున్న కారుపై ఉన్న చలాన్లు కట్టలేదు.
ఓఆర్‌ఆర్‌పైనే ఎక్కువ..
ఇక అసద్ కారుపైఉన్న పెండింగ్ చలాన్లలో ఎక్కువ శాతం ఓఆర్‌ఆర్‌పై విధించినవే కావడం గమనార్హం. ఓఆర్‌ఆర్ ఎక్కగానే ఎంపీ వాహనం లిమిట్ లేకుండా స్పీడ్‌గా వెళ్తుంది. ఓవర్ స్పీడ్ కారణంగానే చలాన్లు విధించారు. ఇక ప్రజాప్రతినిధి అయి ఉండి.. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అసద్.. తన వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనను ఎవరు ఆపుతారన్న ధీమాతో ఇలా చేసి ఉంటారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.