Durgam Cheruvu: హైదరాబాదులోని దుర్గం చెరువులో వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. అలా చనిపోయిన చాపలు కుప్పలు కుప్పలుగా ఒడ్డుకు చేరుతున్నాయి. దీంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. వేల సంఖ్యలో చేపల మృత్యువాత కారణంగా దుర్వాసన వస్తోంది. అయితే చేపలు మృతి చెందడం వెనుక కారణం అంత చిక్కడం లేదు. మురుగునీరు చెరువులోకి చేరడం వల్లే చేపలు చనిపోతున్నయాన్ని కొందరు చెబుతుండగా.. విష ప్రయోగం జరిగి ఉంటుందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం సందర్శికులతో దుర్గం చెరువు కిటకిటలాడుతూ కనిపిస్తుంటుంది. అటువంటి చెరువు సమీపంలో చేపలు మృత్యువాత పడుతుండడానికి చూసి సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట నుంచి చెరువులోకి భారీగా మురుగు నీరు చేరడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చెరువు చుట్టూ నిర్మాణాలు జరుగుతున్నాయి. బిల్డర్లు బ్లాస్టింగ్ లో వినియోగించే కెమికల్స్ తో కూడిన నీరు చెరువులోకి చేరడం వల్లే చాపలు చనిపోయి ఉంటాయన్న అనుమానాలు ఉన్నాయి.
అయితే ఈ చెరువులో ఒక్క చేపలే కాదు.. పెద్ద పెద్ద తాబేళ్లు సైతం కనిపిస్తుంటాయి. నిత్యం చెరువును సందర్శించేవారు తాబేళ్లు,చేపలకు ఆహారం వేస్తుంటారు. బిస్కెట్లు,రొట్టెలు, బ్రెడ్స్ ఇలా వారి తోచింది వేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా విష ప్రయోగం చేసి ఉంటారన్న అనుమానం కూడా ఉంది. అయితే నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడడం పై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చెరువులోకి మురుగునీరు ప్రవేశించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.