Telangana Assembly : నీయమ్మ ముసుకో బైట కూడా తిరగనియ్య కొడుకా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన దానం.. ఎమ్మెల్యేవా? అసెంబ్లీ రౌడీవా? ఏంటా మాటలు?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత‍్తరంగా సాగుతున్నాయి. 12 రోజులుగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో వర్షాకాల సమావేశాల చివరి రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

Written By: Raj Shekar, Updated On : August 2, 2024 8:55 pm
Follow us on

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో.. రేవంత్‌రెడ్డి సర్కార్ పలు కీలక ప్రకటనలు చేస్తుండగా.. మరోవైపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీంఎతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రులు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నారు. వాటికి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ధీటుగానే సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొన్నిసార్లు.. పరిధి దాటి పోతున్నాయి. అన్ పార్లమెంటరీ పదాలతో బయట వీధుల్లో మాట్లాడే భాషను సభలో వాడుతుండటం శోచనీయం. విపక్ష నేతలు సీఎంను చీప్‌ మినిస్టర్‌ అని వ్యాఖ్యానించగా, మంత్రులు వాటిని తిప్పి కొడుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు లక్ష్యంగా విమర్శలు, వ్యంగ్యా స్త్రాలు సంధిస్తున్నారు. చివరి రోజు శుక్రవారం(ఆగస్టు 2న) జరిగిన సమావేశాల్లో అందరు సభ్యులు మాట్లాడే క్రమంలో.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కూడా అవకాశం రావటంతో.. ఆయన హైదరాబాద్‌‌కు చేసిన కేటాయింపులపై ప్రసంగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌ను.. ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ఆయనకు సభలో మాట్లాడే అర్హత లేదంటూ ఆందోళన చేశారు. దీంతో సహనం కోల్పోయిన దానం నాగేందర్.. నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. సభలో వాడకూడని పదాలతో విపక్ష సభ్యులను ధూషించారు. అసెంబ్లీ రౌడీలా ప్రతిపక్ష సభ్యులకు ధమ్కీ ఇచ్చారు.

-అన్‌ పార్లమెంటరీ పదాలు..

దానం మాట్లాడకుండా అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ “ఏయ్ మూస్కోవోయ్.. నీయమ్మ బయట కూడా తిరగనియ్య కొడకా మిమ్మల్ని.. ఏమనుకుంటున్నార్రా మీరు నీయామ్మ.. ఏయ్.. తోలుతీస్తా కొడకా ఒక్కొక్కరిది.. తోలు తీస్తా ఒక్కొక్కనిది చెప్తున్నా.. ఏం అరేయ్.. బయట కూడా తిరగనియ్యా చెప్తున్నా నిన్ను..” అంటూ.. రెచ్చిపోయారు దానం నాగేందర్. బూతులతో పాటు వార్నింగులు కూడా ఇచ్చారు.

-సభాపతి వారించినా..
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ధూషిస్తున్న నాగేందర్‌ను సభాపతి గడ్డం ప్రసాద్‌ వారించే ప్రయత్నం చేశారు. కానీ దానం సభాపతిని కూడా లెక్క చేయకుండా రెచ్చిపోయారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలను కూడా ఆగాలని సైగ చేశారు. అయితే దానం మాటలను రికార్డుల నుంచి తొలగించలేదు. దీంతో దానం నాగేందర్ వాడిన పదాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు స్పీకర్‌కు చిట్టీలు పంపించారు. అప్పుడు కానీ.. పరిస్థితి అర్థం చేసుకున్న స్పీకర్.. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దానం అన్ పార్లమెంటరీ పదాలు వాడి ఉంటే.. రికార్డులను పరిశీలించి తొలిగిస్తామని తెలిపారు. ఈ ముచ్చట చెప్పే క్రమంలోనూ.. నీయమ్మా అనే పదం అన్ పార్లమెంటరీ పదం కాదని.. హైదరాబాద్‌లో చాలా కామన్ అంటూ దానం నాగేందర్.. తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం గమనార్హం.