Allu Arjun And Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ‘కూలీ’ చిత్రం తర్వాత మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వార్త , మన ఆడియన్స్ ని ఎంత సంతోషపరిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముందుగా లోకేష్ కనకరాజ్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ఒక సినిమా చేయబోతున్నాడు, ఈ చిత్రాన్ని KVN సంస్థ నిర్మించబోతోంది అనే వార్త వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అనే వార్త వచ్చింది. ఈ రెండిట్లో ఏది నిజం, ఏది అబద్దం అనే తికమక అల్లు అర్జున్(Icon star Allu Arjun), పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఉండేది. కానీ అసలు విషయం ఏమిటంటే, లోకేష్ కనకరాజ్ త్వరలో అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్న విషయం వాస్తవమే, అదే విధంగా పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న విషయం కూడా వాస్తవమే. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.
అదే విధంగా పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా KVN ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ రెండిట్లో ముందు ఏ సినిమాని మొదలు పెట్టాలి అనే దానిపై నిన్న మొన్నటి వరకు లోకేష్ కనకరాజ్ కి క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు కూడా తనకు ఎప్పుడు డేట్స్ ఇస్తారు అనేది చెప్పలేదు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటంటే, అల్లు అర్జున్ జులై నెల నుండి లోకేష్ కి డేట్స్ ఇస్తానని రెండు రోజుల క్రితమే ఖరారు చేసి చెప్పాడట. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్ కనకరాజ్ కోసం హైదరాబాద్ లో ఆయన టీంకి ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసే పనిలో పడ్డారట. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట మేకర్స్. అది సంక్రాంతికి చేయొచ్చని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ సినిమా మొదలయ్యేది 2027 వ సంవత్సరం లోనే. ముందుగా ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే 2027 జనవరి నెల నుండి OG ప్రీక్వెల్ ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక, 2027 సెకండ్ హాఫ్ లోనే లోకేష్ కనకరాజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మూవీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.