https://oktelugu.com/

Konda Surekha : కొండా సురేఖకు బిగ్ షాక్.. కేసు నమోదు.. కోర్టుకు రావాల్సిందే

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ మధ్య సినీ నటుడు నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య విడాకుల వ్యవహారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 28, 2024 / 09:14 PM IST

    Konda-surekha

    Follow us on

    Konda Surekha : నాగచైతన్య – అతడి సతీమణి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో పెద్ద దుమారాన్ని రేపగా.. సినీ పరిశ్రమలో సంచలనాన్ని కలిగించాయి. సురేఖ వ్యాఖ్యలు చేయడంతో వెంటనే నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయ నాయకులు తమ రాజకీయాల కోసం తమ కుటుంబ వ్యవహారాలను బయటకు లాగొద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు . కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పట్ల ఆయన కూడా పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇక నాగార్జున కూడా కొండా సురేఖ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సినీ ప్రముఖులు స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే నాని వరకు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. సినీ పరిశ్రమపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు. దీనిపై సమంత నోరు విప్పకపోగా.. తన జీవితాన్ని ఎందుకు మళ్ళీ బయటికి లాగుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇక తను చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. దీనిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని అటు సినీ పరిశ్రమ వర్గాలకు, ఇటు రాజకీయ వర్గాలకు సూచించారు.

    కోర్టుకు రావాల్సిందే

    కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనిని నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సురేఖ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా కొండా సురేఖ డిసెంబర్ 12న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఇక అప్పట్లో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ” ప్రజా ప్రతినిధిగా ఉన్నవాళ్లు బాధ్యతగా నడుచుకోవాలి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. అంతేతప్ప ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు. అలా చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయి.. అవి అంతిమంగా రాజకీయ నాయకులను చులకన చేస్తాయని” వ్యాఖ్యానించింది..

    ఇక మరోవైపు ఇటీవల ఒక విందు విషయంలో కొండా సురేఖ చేసిన వీడియో కాల్ వివాదంగా మారింది. దీనిని భారత రాష్ట్ర సమితి నాయకులు గా ప్రచారం చేశారు. ఆ మధ్య కేటీఆర్ బావమరిది ఇంట్లో పార్టీ జరిగితే నానా రచ్చ చేశారని.. ఇప్పుడు కొండా సురేఖ చేసినది ఏంటని ప్రశ్నించారు. నాడు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ను అదుపులోకి తీసుకున్నట్టే.. కొండా సురేఖను కూడా తీసుకుంటారా అని ప్రశ్నించారు. అయితే నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కొండా సురేఖ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆమె కోర్టుకు హాజరవుతారా? లేక మినహాయింపు కోరతారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.. కొండా సురేఖ ఇటీవల కూడా కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై తాను ఇలాగే మాట్లాడతానని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొండా సురేఖ ఎలాంటి అడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.