Viral News : వెనుకటి కాలంలో ఆదిమానవులు అడవుల్లో చెట్లపై ఆవాసాలు ఏర్పరుచుకునేవారు. తొర్రల్లో నివాసం ఉండేవారు. క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడం కోసం వారు అలాంటి చర్యలు పాటించేవారు. చెట్లపై ఉండి నిరంతరం క్రూర జంతువుల కదలికలను గమనించేవారు.. అయితే అలాంటి ఓ నిర్మాణం ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.. వెనుకటి కాలంలో ఆదిమానవులు చెట్లపై నివాసం ఏర్పరచుకొని జీవించేవారు. చెట్ల తొర్రల్లో ఉంటూ తమను తాము కాపాడుకునేవారు.. అయితే నేటి నవీన కాలంలో ఇటువంటి నిర్మాణాలు దాదాపుగా లేవు. సినిమాల్లో మాత్రం చెట్లపై కంచెల వంటి నిర్మాణాలు ఏర్పాటు చేసి ఆదిమానవులు నివసించిన దృశ్యాలను చూపిస్తుంటారు. అయితే ఇంటర్నెట్లో సందడి చేస్తున్న ఓ ఫోటో మాత్రం అలానే కనిపిస్తోంది. అయితే అది ఆదిమానుల నివాసం కాదు. అది ఒక ప్రార్థన మందిరం.. దాని నిర్మాణం వెనుక అనేక ఆసక్తికర విషయాలున్నాయి.
ఇంతకీ ఎక్కడ ఉందంటే..
ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెంలో పెద్ద మర్రిచెట్టు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక ప్రార్థన మందిరాన్ని నిర్మించారు. అయితే అది ఆదిమానవులు ఏర్పాటు చేసుకున్న నిర్మాణం మాదిరిగా ఉంది. చాలామంది ఆ నిర్మాణం చూస్తే ఆదిమానవులు నిర్మించుకున్నారని భావించక తప్పదు. చెట్టుపై ఆ నిర్మాణం ఎంతో దృఢంగా ఉంది. పిఠాపురం ప్రాంతానికి చెందిన ఉమర్ ఆలీషా పేరుతో ఒక ట్రస్ట్ ఒక పీఠాన్ని నిర్మించింది.. ఈ ట్రస్ట్ సభ్యులు మర్రిచెట్టు పై చీమల వారి గూడెం సమీపంలో మొహిద్దిన్ బాద్షా పేరుతో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.
నిర్మాణం ఎలా ఉందంటే..
మర్రిచెట్టు పై చతురస్రాకారంలో ఈ నిర్మాణం ఉంది. ప్రతి గురువారం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. గిరిజనులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఈ నిర్మాణానికి కాస్త దగ్గర్లో జమ్ముగడ్డి ఒక పర్ణశాల కూడా నిర్మించారు. ఇది ఆ ప్రాంత వాసులకు ఒక పర్యాటక విడిదిగా మారిపోయింది. మర్రి చెట్టు పైకి ఎక్కి చాలామంది అక్కడ ధ్యానం చేసుకుంటారు. చెట్టుపై నుంచి ప్రకృతి అందాలను వీక్షిస్తుంటారు. సెల్ ఫోన్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ కొన్ని లఘు చిత్రాలను కూడా షూటింగ్ చేశారు. స్థానిక కళాకారులు పాటలు కూడా దృశ్యీకరించారు. ” ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదంగా మార్చాలి. చుట్టూ ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఉన్నాయి. అవి పర్యాటకులకు అద్భుతమైన విడిది ప్రాంతాలుగా మారతాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగా వస్తుంది.. దానిని అధికారులు పరిశీలనలోకి తీసుకోవాలని” స్థానికులు కోరుతున్నారు.