HomeతెలంగాణHyderabad: పంది కొవ్వుతో నూనె.. బయట ఫాస్ట్‌ఫుడ్‌ తినేవాళ్లందరికీ ఇది షాకింగ్‌ న్యూస్‌!

Hyderabad: పంది కొవ్వుతో నూనె.. బయట ఫాస్ట్‌ఫుడ్‌ తినేవాళ్లందరికీ ఇది షాకింగ్‌ న్యూస్‌!

Hyderabad: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. పాలు, నూనె నుంచి భోజనం వరకు.. జూస్‌లు, స్వీట్స్, చివకు తేనె కూడా కల్తీ అవుతోంది. పెయిన్‌ బామ్స్, సోప్స్, తినుబండారాలు, అల్లం పేస్టు కూడా కల్తీ అవుతోంది.. తయారుచేస్తున్నారు. తినే ఆహారానికి మంచి మార్కెట్‌ ఉండడంతో కొంతమంది దీనినే తమ కల్తీ దందాకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఎన్ని వీలైతే అన్ని కల్తీ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. దుకాణాల్లో అమ్మకానికి పెడుతున్నారు. ఆకర్షణీయమైన స్టిక్కరింగ్‌తో కస్టమర్లను బుట్టలో వేసుకుంటున్నారు. తాజాగా

ధరల భారంతో సామాన్యుల ఇబ్బంది..
ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతుండంతో సామాన్యులు.. ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వాటిని క్యాష్‌ చేసుకుని కల్తీ కేటుగాళ్లు మరీంత రెచ్చిపోతున్నారు. ఉప్పు, కారం నుండి మొదలుకొని దాదాపు అన్నిటిలోనూ కల్తీ చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో కల్తీగాళ్లు మరింతగా దిగజారిపోతున్నారు.

పంది కొవ్వుతో నూనె..
తాజాగా హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ పరిధిలోని ఆర్కేపురంలో ప్రజలు మరింత అసహ్యించుకొనే కల్తీ భాగోతం బయటపడింది. స్థానికంగా ఉండే రమేశ్‌ శివ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా తన నివాసంలోనే గత కొన్నేళ్లుగా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వును సేకరించి.. కొవ్వును వేడి చేసి అందులో పలు రసాయనాలు కలిపి అచ్చం వంట నూనెలా తయారు చేసి రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్‌ ఫుడ్‌ దుకాణాలకు తక్కువ ధరకే అమ్ముతున్నాడు.

పక్కా సమాచారంతో సోదాలు..
కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడిచేశారు. రమేశ్‌ శివ ఇంట్లో తనఖీలు చేశారు. ఇందులో బండారం మొత్తం బయటపడింది. పోలీసులు ఆ కేటుగాన్ని అరెస్ట్‌ చేశారు.

ఆరోగ్యానికి ముప్పు
కల్తీ వస్తువులతో ప్రజారోగ్యానికి ముప్పు ఏ్పడుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. క్యాన్సర్, హార్ట్‌ఎటాక్, కిడ్నీ, లివర్‌ వ్యాధులకు కల్తీ సరుకులే కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. తమకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా దీర్ఘకాలిక రోగాలబారిన పడడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నాకు. కానీ కల్తీ సరుకులు, తినే ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్నాయని వైద్యులు అంటున్నారు. కల్తీవి తినడం వల్ల డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version