HomeతెలంగాణTelangana Elections 2023: క్యాంపులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు..

Telangana Elections 2023: క్యాంపులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు..

Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా సర్వే సంస్థలు ప్రకటించాయి. సింగిల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేల్చి చెప్పేశాయి. అదే కొన్ని సంస్థలు మాత్రం తెలంగాణలో ఏర్పడుతుందని కుండ బద్దలు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ హంగ్ ప్రభుత్వం ఏర్పడితే తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను కాపాడుకోవడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.. ఇందులో భాగంగానే ఆపరేషన్ బెంగళూరుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

బెంగళూరు తరలించాలని..

రాష్ట్రంలో 70కి పై స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పై కూడా దృష్టి సాధించింది. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానంలో బెంగళూరు తరలించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అభ్యర్థులను పార్టీ నాయకత్వం ప్రభుత్వం చేసినట్టు సమాచారం. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఈ ఆపరేషన్ కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు పార్టీ నుంచి బాధ్యులను నియమించి…అయా అభ్యర్థులు గెలిచినట్టుగా పత్రం తీసుకోగానే తిరిగి క్యాంపునకు తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.. 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ ల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ఎఎల్పీ లో విలీనం చేసుకున్న కేసీఆర్.. 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను భారత రాష్ట్ర సమితిలో విలీనం చేసుకున్నారు. ఒకవేళ హాంగ్ ఏర్పడితే కెసిఆర్ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను శిబిరాలకు తరలించాలని డీకే శివకుమార్ యోచిస్తున్నారు.

కెసిఆర్ బారిన పడకుండా

సాధారణంగా ఇలాంటి కొనుగోలు, శిబిర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాక పోయినప్పటికీ.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్నారు. అధికారం కోసం ఏదైనా చేయగలిగేంత సత్తాను పలుమార్లు ప్రదర్శించారు కూడా. ఒకవేళ హంగ్ ఏర్పడితే కేసీఆర్ కు ఎంఐఎంతోపాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సహకారం అవసరం ఉంటుంది. అలాంటప్పుడు అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీగా నజరానా ముట్ట జెప్పాల్సి వస్తుంది. అయితే దానికి కెసిఆర్ వెనుకాడడు కాబట్టే.. ముందు ముప్పును గుర్తించి కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ ను లైన్ లో పెట్టిందని తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో సంక్షోభం తలెత్తినప్పుడు ఆయన అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం దక్షిణదిలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తుంది.. ఇప్పటికే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు పార్టీ నుంచి సందేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 3 తర్వాత గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం తీసుకున్న అనంతరం నేరుగా బెంగళూరు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version