Gold Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 1న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,730 గా ఉంది. నవంబర్ 30న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100తో విక్రయించారు.

Written By: Chai Muchhata, Updated On : December 1, 2023 8:12 am

Gold Prices

Follow us on

Gold Prices: బంగారం, వెండి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఒక్కరోజులో బంగారం రూ.600 మేర తగ్గింది. వెండి ధరలు తగ్గకపోయినా స్థిరంగా కొనసాగాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారికి శుభవార్త అని చెప్పొచ్చు.

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 1న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,730 గా ఉంది. నవంబర్ 30న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100తో విక్రయించారు. గురువారం కంటే శుక్రవారం బంగారం ధరలు రూ.600 తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,880గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,730 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,980తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,980తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,500తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,730తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.79,200గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.79,200గా ఉంది. ముంబైలో రూ.79,200, చెన్నైలో రూ.82,200, బెంగుళూరులో 78,000, హైదరాబాద్ లో రూ.82,200తో విక్రయిస్తున్నారు.