Hyderabad: వర్షం పడితే పాత వాతలు తేలుతాయని ఓ సామెత. ఆ సామెత ఎలా పుట్టిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న వీడియో మాత్రం ఆ సామెతను నూటికి నూరు శాతం నిజం అని నిరూపిస్తోంది. ఆ వీడియోలో చూసిన దృశ్యాలు.. మామూలుగా లేవు. చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. జనం ఇంత కరువులో ఉన్నారా.. తమ కరువు తీర్చుకోవడానికి ఇంతలా తాపత్రయపడుతున్నారా.. అని అనిపిస్తోంది.
ఆ మధ్య గుంటూరులో వర్షం పడితే వాడి పడేసిన కండోమ్ లు రోడ్డుమీదికి ప్రవాహ మాదిరిగా వచ్చాయి. వర్షపు నీటికి అవన్నీ కొట్టుకొని వచ్చి రోడ్డుమీద పేరుకుపోయాయి. ఆ ప్రాంతంలో లాడ్జీలు, హోటల్లు అధికంగా ఉండడంతో ఇవన్నీ బయటపడ్డాయని తెలిసింది. గుంటూరులో జరిగిన సంఘటన మర్చిపోకముందే హైదరాబాదులో కృష్ణానగర్ ప్రాంతంలో వర్షపు నీటికి కండోమ్ ప్యాకెట్లు వెల్లువలా వచ్చాయి. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
కృష్ణ నగర్ ప్రాంతంలో ఎక్కువగా సినీ ఆర్టిస్టులు ఉంటారు. చాలామంది అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ హోటళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. లాడ్జిల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో కో లివింగ్ హాస్టల్స్ కూడా ఏర్పాటయ్యాయి. ఐటి కంపెనీలలో పని చేసే ఉద్యోగులు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ నుంచి మాదాపూర్, మియాపూర్, ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లంతా ఇక్కడ ఉంటున్నారు. వారంతా కూడా కో లివింగ్ హాస్టల్స్ లో ఆశ్రయం పొందుతున్నారు. కో లివింగ్ హాస్టల్ అంటే పెళ్ళి కాకుండానే ఆడ మగ కలిసి ఉండటం.. అవసరమైతే కలిసి పడుకోవడం.. ఇవన్నీ సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టే కండోమ్ ప్యాకెట్లను దండిగా వాడుతున్నారు. ఆ తర్వాత వాటిని పడేస్తున్నారు. వర్షం విపరీతంగా కురవడంతో.. వచ్చిన వరదకు ఆ ప్యాకెట్లు రోడ్డు మీద పేరుకుపోయాయి. ఈ దృశ్యాలను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు..” ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఒంటి సాంగత్యం కోసం కండోమ్ ప్యాకెట్లు వాడుతున్నారు. ఇంత స్థాయిలో బయటికి వచ్చాయంటే ఎంత కరువులో ఉన్నారో.. బాబాయ్ చూస్తుంటేనే ఒకరకంగా ఉందని” స్థానికులు చర్చించుకుంటున్నారు.