Kattappa: ప్రస్తుతం రాజమౌళి ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్…ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు గొప్ప విజయాలను సాధించి పెట్టాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినప్పటికి రాజమౌళి నుంచి వచ్చే సినిమా చాలా క్వాలిటీ గా ఉంటుంది. అలాగే ఆ సినిమాని ఇతరుల సినిమాలతో పోల్చుకోవడానికి కూడా వీలులేని విధంగా ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో ఆ సినిమాని తెరకెక్కిస్తాడు… దీనివల్ల సినిమాని చూసే సగటు ప్రేక్షకుడికి ఆయన సినిమాలు 100% ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తాయి… అందువల్లే రాజమౌళి సినిమాలకు ఇండియాలో చాలా మంచి పాపులారిటి ఉంది. ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర మంచి పాపులారిటిని సంపాదించుకుంది. బాహుబలి పాత్రకి ఎంతటి గొప్ప గుర్తింపు లభించిందో కట్టప్ప పాత్రకి కూడా అంతే ఆదరణ దక్కింది. సినిమాలో కట్టప్ప మహిష్మతి రాజ్యానికి కట్టుబడి ఉంటాడు.
ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మాహిష్మతి రాజ్యానికి కట్టు బానిసగా ఉంటూ ఆ రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బాహుబలి సినిమా కథ రచయిత అయిన ‘విజయేంద్ర ప్రసాద్’ సైతం ‘కట్టప్ప’ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అతని పూర్వీకులు ఎవరు? ఎందుకని కట్టప్ప ‘మహిష్మతి’ సామ్రాజ్యానికి కట్టు బానిసగా ఉండాల్సి వచ్చింది అనే విషయాలను హైలైట్ చేస్తూ ఒక సినిమాను తీసే ఆలోచనలో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి కథను రెడీ చేశారట. మరి తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి..
ఇక రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడా? లేదంటే వేరే వాళ్ళతో ఈ సినిమాని చేయిస్తాడా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే బాహుబలి లో కట్టప్ప పాత్ర మంచి గుర్తింపును సంపాదించుకుంది. కాబట్టి రాజమౌళి అలాంటి ఒక పాత్రతో సినిమా చేయాలనుకోవడం విశేషం…