Chiranjeevi Vs Balakrishna: దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీ బాగోగులు చూసుకునే వారు కరువైపోయారు… సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా కొన్ని విషయాల్లో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తెలిసిన ప్రతిసారి చిరంజీవి ఒకరకంగా ఇండస్ట్రీని గట్టెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా చిన్న సినిమాల మధ్య వచ్చే వివాదాలను సైతం సరిపెట్టడంలో ఆయన కీలకపాత్ర వహిస్తున్నాడు… గతంలో ఆయన ‘ప్రజారాజ్యం’ అనే రాజకీయ పార్టీ పెట్టాడు. కానీ ఆయన నమ్మినవారే తనని మోసం చేయడంతో రాజకీయాలు మనకు పనికిరావని తెలుసుకొని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా సాఫీగా నడిపిస్తున్నాడు. ఇక ఇప్పటికి చాలామంది ఎప్పుడో ఒకప్పుడు చిరంజీవి మీద కొన్ని విమర్శలైతే చేస్తూనే వస్తున్నారు…జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ల అన్నయ్య చిరంజీవి…కాబట్టి ప్రస్తుతం అపోజిషన్ లో ఉన్న వైకాపా పార్టీ నేతలు చిరంజీవి మీద విమర్శలు చేసిన పర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను తక్కువ చేయడానికి ఇలాంటి రాజకీయ అస్త్రాలను వదులుతూ ఉంటారు అని కార్యకర్తలు సైతం అర్థం చేసుకుంటారు. కానీ జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాళ్ల బామ్మర్ది, హిందూపురం ఎం ఎల్ ఏ అయిన నందమూరి బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి కొన్ని ఘాటు మాటలు మాట్లాడటం పట్ల చిరంజీవి అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు సైతం కొంతవరకు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు… అసెంబ్లీ వేదికగా బాలయ్య బాబు మొదట జగన్ ను సైకో అంటూ మాట్లాడాడు… అలాగే చిరంజీవిని ఉద్దేశించి కూడా కొన్ని అనకూడని మాటలైతే మాట్లాడాడు. దానివల్ల బాలకృష్ణని ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు.
బాలయ్య కంటే చిరంజీవి పెద్దవాడు అలాగే సినిమాల పరంగా కూడా చిరంజీవి రేంజ్ బాలయ్య బాబు కంటే చాలా ఎక్కువనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చిరంజీవి మీద గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు…ఇప్పటికే మెగా అభిమానులు బాలయ్య మీద సీరియస్ అవుతున్నారు…ఇక చిరంజీవి సైతం ఒక లేఖ రాశారు. బాలయ్య ఎందుకని ఇలా అప్పుడప్పుడు టాంగ్ స్లిప్ అవుతూ విమర్శలను మూటగట్టుకుంటాడు.
ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే కనీస ఙ్ఞానం కూడా తనకు లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఇతరులను కించపరుస్తూ మాట్లాడడం హీరోయిజం అవుతోందా? అంటూ పలువురు సినీ రాజకీయ విశ్లేషకులు సైతం బాలయ్య బాబు వైఖరిని తప్పుబడుతున్నారు… ఇదే విషయం మీద వైకాపా నేతలు సైతం జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదంటూ విమర్శిస్తున్నారు…నిజానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యను అనరాని మాటలు అంటే పార్టీ నాయకులు సైతం ఏదో చోద్యం చూస్తున్నారు.
ఆ సభ లో బాలకృష్ణను ఖండించేవారు లేకపోయారు. ఎందుకని ఇలా చేస్తున్నారు అంటూ వైసీపీ వాళ్లు కూడా ఇటు జనసేన పార్టీని అటు బాలయ్య బాబును విమర్శిస్తున్నారు. ఇక ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుంది బాలకృష్ణ బహిరంగంగా వచ్చి చిరంజీవికి క్షమాపణలు చెబుతాడా? లేదా అనే విషయాల మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…