గచ్చిబౌలి స్టేడియంలో క్రీకాకారులు ఆందోళనకు దిగారు. స్టేడియాన్ని కాపాడాలని ధర్నా చేపట్టారు. టిమ్స్ ఆసుపత్రి కోసం ఇప్పటికే 9 ఎకరాలు కేటాయించగా.. గచ్చిబౌలి స్టేడియంలోని మరో 5 ఎకరాలు టిమ్స్ కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే స్టేడియం గచ్చిబౌలి స్టేడియమని, దాన్ని కూడా హాస్పిటల్ కు ఇవ్వడం అన్యాయం అంటూ ఆందోళన చేపట్టారు.

ఆరోగ్యంగా ఉండాలంటే స్పోర్ట్స్ ఫిట్ నెస్ తప్పవనిసరి అని అథ్లెట్లు చెబుతున్నారు. సింధు ఒలింపిక్ పథకం సాధించింది అటే అది గచ్చిబౌలి స్టేడియం వల్లేనే అని, అలాంటి స్టేడియం విచ్చినం చేయడం సరైనది కాదని అంటున్న అథ్లెట్స్ వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. గచ్చిబౌలి స్టేడియం మధ్యలో నుంచి ఐదెకరాల స్థలాన్ని టిమ్స్ కు కేటాయించడం సరైందకాదని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే రఘునందర్ రావు. టిమ్స్ కు పంచనామాచేసి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఎల్బీస్టేడియం పరిస్థితి అధ్వానంగా తయారైందని, మౌలిక సదుపాయాలు లేకపోతే క్రీడాకారులు ఎలా పుట్టుకు వస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. క్రీడా విజేజ్ ఏర్పాటు చేస్తానన్న సీఎం కేసీఆర్ ఏడేళ్లయినా నిర్మించలేదని గుర్తుచేశారు. సరూర్ నగర్ స్టేడియంలో కోచ్ లకు ఐదుళ్లుగా జీతాలు లేవని, స్టూడెంట్స్ తలో కొంత వేసుకుని కోచ్ కు జీతం చెల్లించే పరిస్థితి ఉందని అన్నారు. స్టేడియాలను ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు.