HomeతెలంగాణCM Revanth Reddy And BJP: బీజేపీ పెద్దలతో రేవంత్ బంధం.. ఆ సీక్రెట్ బయటపడింది

CM Revanth Reddy And BJP: బీజేపీ పెద్దలతో రేవంత్ బంధం.. ఆ సీక్రెట్ బయటపడింది

CM Revanth Reddy And BJP: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారని, ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారని, త్వరలోనే రేవంత్‌ బీజేపీలో చేరతారని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పదే పదే ఆరోపిస్తున్నారు. కొందరు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ నుంచి మూఠలు మోస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిని అధికార కాంగ్రెస్‌ నేతలు తిప్పి కొడుతున్నారు. కానీ, తాజాగా తన ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న రహస్యాన్ని రేవంత్‌రెడ్డి బయటపెట్టారు.

మోదీతో సమావేశాలు అందుకే..
బీఆర్‌ఎస్‌ విమర్శలపై స్పందించిన సీఎం రేవంత్‌.. ‘ప్రధాని మోదీగారిని మూడు నెలలకు ఒకసారి కలుస్తున్నాను. ఇతర కేంద్ర మంత్రులతో క్రమం తప్పకుండా మాట్లాడుకుంటున్నాను. తెలంగాణకు నిధులు, అనుమతులు పొందడానికి కేంద్ర నాయకులతో మంచి సంబంధాలు పెంచుకుంటున్నాను‘ అని స్పష్టం చేశారు. కేంద్రం అనుమతి ఇస్తేనే తెలంగాణకు ప్రాజెక్టులు వస్తాయని తెలిపారు.

విపక్షాలు సహకరించాలి..
విపక్శ నాయకులు దీన్ని రాజకీయంగా వాడుకోకుండా రాష్ట్ర అభివృద్ధికి వీలైతే సహకరించాలి. లేదంటే మౌనంగా ఉండాలని రేవంత్‌ స్పష్టం చేశారు. ‘సమస్యలు ఉంటే ప్రభుత్వంతో పంచుకోండి. మేమే కేంద్రంతో మధ్యవర్తిత్వం చేసి, రాష్ట్రానికి సహాయం తెచ్చేస్తాం తెలిపారు. రాజకీయాల కోసం విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో çసత్సంసంబంధాలు ఏర్పరచడం ద్వారా రేవంత్‌ రెడ్డి ధృఢ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ అహంకారాలు, వ్యక్తిగత లాభాలకు భిన్నంగా, రాష్ట్ర ప్రాధాన్యతలను ముందుగా పెట్టారు. మోదీని కలిస్తే తప్పేంటని నేరుగా ప్రశ్నించారు. నిధులు తేవడానికి ఎవరినైనా ఎన్నిసార్లయినా కలవడానికి సిద్ధమని స్పష్టంగా చెప్పారు. దీంతో ఇక విపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టినట్లయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version