CM Revanth Reddy Gaddar Awards 2025: బహుశా అలాంటి విధానాన్ని రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాదులో జరిగిన గద్దర్ అవార్డులో ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి సమయం దొరికితే చాలు భారత రాష్ట్ర సమితిని ఉతికి ఆరేస్తున్నారు. కుంభకోణాల పేరుతో తూర్పారబడుతున్నారు.. గొర్రెల దగ్గర నుంచి మొదలుపెడితే కాలేశ్వరం వరకు ప్రతి విషయంలోనూ భారత రాష్ట్ర సమితిని తొక్కి నార తీస్తున్నారు. ఈ సమయంలో ఆయన తన అటెన్షన్ కోల్పోతున్నారు. భారత రాష్ట్ర సమితి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇవి కొన్ని సందర్భాలలో వినే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి కూడా దీనికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో రాజకీయ వాతావరణం ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఉంటున్నది.. ఇక తాజాగా శనివారం జరిగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు సరికొత్త చర్చకు దారితీసాయి.
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రవేశాన్ని భారతీయ జనతా పార్టీతో మొదలుపెట్టారు. అప్పట్లో బండార్ దత్తాత్రేయ కుమార్తెను ఆయనే స్కూలుకు తీసుకెళ్ళేవారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రవేశించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. స్థిరాస్తి వ్యాపారం కూడా రేవంత్ రెడ్డి చేశారు. అంతకుముందు ఆయన రాజకీయాలలో తన ప్రారంభ ప్రయాణాన్ని సాగించినప్పుడు అనేకమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. అందులో ప్రముఖ నిర్మాత చలసాని అశ్వని దత్ కూడా ఒకరు. నాటి రోజుల్లో అశ్వని దత్ కుమార్తెలతో రేవంత్ రెడ్డికి కాస్త చనువు ఉండేది. ఆ చనువుతోనే చిన్న కుమార్తెను నువ్వు రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకుంటావని సరదాగా ఆట పట్టించేవారు. దానికి ఆమె నవ్వి ఊరుకునేవారు. రేవంత్ రెడ్డి ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో గాని.. చివరికి అదే నిజమైంది. అదే విషయాన్ని గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను ఏది చెప్తే అదే నిజమవుతుందని.. తన మాట మీద నిలబడి ఉండే మనిషినని.. కచ్చితంగా తాను చెప్పింది జరుగుతుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి అశ్వని దత్ కుమార్తె గురించి మాట్లాడుతున్నప్పుడు సభలో ఉన్నవారు మొత్తం నవ్వారు. అన్నట్టు అశ్వనీదత్ కుమార్తె వివాహం చేసుకున్న నాగ్ అశ్విన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి కావడం విశేషం.
అశ్విని దత్ వాళ్ళ అమ్మాయికి 25 ఏళ్ల క్రితమే నువ్వు రెడ్డిల అబ్బాయిని చేసుకుంటావని చెప్పాను.. అదే జరిగింది
జాతకాలు చెప్పడంలో నా సక్సెస్ రేషియో 100 శాతం pic.twitter.com/7k32msCfWU
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025