https://oktelugu.com/

Tata Curvv EV: టాటా నుంచి కొత్త ఎస్ యూవీ కూపే కారు..నేడు మార్కెట్లోకి.. SUV కూపే అంటే?

టాటా కంపెనీ నుంచి బుధవారం ‘కర్వ్’ అనే మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ కారు క్యాబిన్ నెక్సాన్ మాదిరిగానే డ్యాష్ బోర్డు ఉంటుందని తెలుస్తుంది. స్టీరింగ్ వీల్ హారియర్ ను పోలి ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ లో ఏసీ కంట్రోల్ ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 6, 2024 / 05:28 PM IST

    Tata Curvv EV

    Follow us on

    Tata Curvv EV: పండుగల సీజన్ మొదలైన సందర్భంగా మార్కెట్ సందడిగా మారనుంది. ఇప్పుడు కొన్ని రోజుల పాటు మంచి రోజులు ఉండనున్నాయి. దీంతో కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుంటారు. ఇదే సమయంలో కార్లు కొనడానికి ముందుకు వస్తారు. కంపెనీలు సైతం మొన్నటి వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఆగస్తులో కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కార్లు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా బుధవారం మరో కారు రంగంలోకి దిగబోతుంది. టాటా కంపెనీకి చెందిన ఈ కారు గురించిన ప్రాథమిక వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే రిలీజ్ అయిన తరువాత అధికారికంగా ఫీచర్స్, ఇంజిన్ పై అవగాహనకు రావాలి. టాటా కంపెనీ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ఎస్ యూవీ నుంచి హ్యాచ్ బ్యాక్ వరకు వివిధ వేరియంట్లు ఉన్నాయి. కానీ మొదటిసారిగా ఎస్ యూవీ కూపే వెర్షన్ లో దీనిని విడుదల చేస్తున్నారు. అంటే ఇప్పటి రెండు డోర్ల కారు నుంచి 4 డోర్ల వరకు కారును చూశాం. కానీ ఎస్ యూవీ విభాగంలో మొదటిసారిగా కూపే కారును టాటా తీసుకొస్తుంది. కూపేతో అమర్చి ఉన్న ఈ కారు డిజైన్ కూడా అద్భుతంగా ఉండడంతో చాలా మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ధర కూడా బడ్జెట్ లో ఉండడంతో ఈ కారు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి టాటా నుంచి రిలీజ్ అవుతున్న ఈ కారు ఏది? ఆ కారు ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

    టాటా కంపెనీ నుంచి బుధవారం ‘కర్వ్’ అనే మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ కారు క్యాబిన్ నెక్సాన్ మాదిరిగానే డ్యాష్ బోర్డు ఉంటుందని తెలుస్తుంది. స్టీరింగ్ వీల్ హారియర్ ను పోలి ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ లో ఏసీ కంట్రోల్ ఉంటుంది. లైటింగ్ డోర్ల ప్యాడ్ లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్, ఆండ్రాయిడ్ వైర్ లెస్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

    టాటా కర్వ్ సేప్టీ ఫీచర్స్ ఆకట్టుకోనున్నాయి. ఇందులో ఆడాస్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఏబిడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంజిన్ విషయానికొస్తే.. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. టాటా కర్వన్ ను రూ. 10.5 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయించే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోక్స్ వ్యాగన్ టైగన్, మారుతి గ్రాండ్ విఠారాను ఇది దెబ్బ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు.

    టాటా కంపెనీ నుంచి ఎస్ యూవీ వేరియంట్లు ఎక్కువగా మార్కెట్లోకి వచ్చాయి. కానీ ‘కర్వ్’ ఎస్ యూవీ కూపే వెర్షన్ లో మార్కెట్లోకి వస్తుంది. ఇది టాటా నుంచి రిలీజ్ అవుతున్న తొలి కారు. ఇప్పటికే టొయోటా వంటి కంపెనీలు ఇలాంటి మోడల్ ను రిలీజ్ చేశాయి. ఎస్ యూవీ కూపే వెర్షన్ లో 5 డోర్లు కలిగి ఉంటుంది. వెండిలేషన్ అద్భుతంగా ఉంటుందని కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. మరి ఈ కారు ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.