CM Revanth Reddy
CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తున్న సీఎం మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు. ఈ నెలాఖరున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగనునానయి. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యతపై రాహుల్‌గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)సూచనలు చేశారు. ఈ క్రమంలో వీహెచ్‌కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 14 నెలల పాలనతో పార్టీలో కొందరికే పదవులు దక్కాయి. చాలా మంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై ఢిల్లీకి కూడా లేఖలు వెళ్లాయి. దీంతో సీనియర్లకు గుర్తింపు ఇవ్వాలని రాహుల్‌గాంధీ సూచించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో సీనియర్ నేత వీహెచ్‌కు కీలక పదవి దక్కేవ అవకాశాలు ఉన్నాయి. వీహెచ్ రాజ్యసభ(Rajya sabha)సీటు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కూడా అనుకున్నారు. సామాజిక, క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు హైకమాండ్ అండతో కీలక పదవి దక్కేవ అవకాశం ఉంది.
మండలి చైర్మన్‌గా..
శాసన మండలి చైర్మన్ పదవి వీహెచ్‌కు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తున్నారని సమాచారం. రెండు నెలల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెలీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒకటి వీహెచ్‌కు ఇవ్వంతోపాటు ఆయనకు మండలి చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది. వీహెచ్ గతంలో బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఈసారి కూడా అదే పదవి ఇవ్వాలని భావించారు. కానీ, దానికి వీహెచ్ నిరాకరించారు. దీంతో నిరంజన్‌కు ఆ పదవి ఖాయమైంది. అసెంబ్లీ స్పీకర్‌గా దళిత ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్(Prasad Kumar)ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పదవి బీసీ అయిన వీహెచ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశంపై ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.
రెండు పదవులు..
వీహెచ్‌ను మండలి చైర్మన్‌గా నియమించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ చైర్మన్‌గా కూడా నియమిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కుల గణన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ నేతలకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం. వీహెచ్‌తోపాటు పలువురు బీసీ నేతలకు పార్టీ పదవులు ఇస్తారని సమాచారం.