https://oktelugu.com/

Roja: పాపం రోజా.. బ్యాడ్ టైమ్ స్టార్ట్!

మాజీమంత్రి రోజాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఆమె స్థానంలో కొత్త వారి నియామకానికి రంగం సిద్ధమైంది.

Written By: , Updated On : February 12, 2025 / 01:05 PM IST
Roja

Roja

Follow us on

Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా( RK Roja ). ఇందులో నో డౌట్. అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయురాలు కూడా. అయితే ఇటువంటివి పెట్టుకుంటే ఇబ్బంది కరం అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఇకనుంచి మొహమాటలకు పోదలుచుకోలేదు. గెలుపు గుర్రాలనే బరిలో దింపాలని చూస్తున్నారు. అందులో భాగంగా కీలక నియోజకవర్గాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిలు యాక్టివ్ గా లేనిచోట్ల కొత్తవారిని నియమిస్తున్నారు. ఈ విషయంలో సీనియర్లు అని చూడడం లేదు. ఇప్పటికే వైసీపీ హయాంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం వంటి వారిని కూడా మార్చేశారు. ఆయన స్థానంలో కొత్త ఇన్చార్జిని ప్రకటించారు. అంబటి రాంబాబు లాంటి వారిని సైతం మార్చేసి కఠిన సంకేతాలు పంపారు. ఇప్పుడు ఆర్కే రోజా విషయంలో సైతం అదే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం అవుతోంది. నగిరి వైసీపీ ఇన్చార్జిగా గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్ ను ఎంపిక చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

* నగిరి కి దూరంగా రోజా
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు గాలి ముద్దుకృష్ణమనాయుడు( Gali Muddu krishnamma Naidu ). గత రెండు ఎన్నికల్లో ఆ కుటుంబం పై గెలుస్తూ వచ్చారు ఆర్కే రోజా. ఈ ఎన్నికల్లో మాత్రం గాలి ముద్దు కృష్ణమా పెద్ద కుమారుడు భాను ప్రకాష్ చేతిలో ఓడిపోయారు. అయితే అక్కడ ఆర్కే రోజా ప్రస్తుతం అందుబాటులో ఉండరన్న విమర్శ ఉంది. పైగా సొంత పార్టీ శ్రేణులతో ఆమెకు విభేదాలు ఉన్నాయి. ఆపై జిల్లా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఆమెను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

* గాలి కుటుంబంలో విభేదాలు
అయితే గాలి కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2019 ఎన్నికల్లో టికెట్ కోసం పట్టుబట్టారు గాలి చిన్న కుమారుడు జగదీష్( Jagdish ). అప్పట్లో చంద్రబాబు సముదాయించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు భాను ప్రకాష్ కు అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రోజాపై ఓడిపోయారు భాను ప్రకాష్. అయితే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరారు జగదీష్. కానీ చంద్రబాబు మాట తప్పారు. ఇప్పుడు గెలిచిన భాను ప్రకాష్ సైతం తమ్ముడుని లెక్క చేయడం లేదు. అందుకే గాలి జగదీష్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

* చేరిక వాయిదా
వాస్తవానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) సమక్షంలో జగదీష్ వైసీపీలో చేరాల్సి ఉంది. కానీ మంత్రి ఆర్కే రోజా అనుమతి తీసుకుని చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తనకు ప్రత్యామ్నాయంగా జగదీష్ ను తేవడానికి రోజా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆమె ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆమె వచ్చిన తర్వాత చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని.. అయితే గాలి జగదీష్ ను వైసీపీలోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఒక విధంగా ఇది ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు క్లిష్ట సమయం. ఆమెకు పొమ్మనలేక పొగ పెట్టినట్టే. చూడాలి మరి ఏం జరుగుతుందో?