Bandi Sanjay Comments On KTR: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చుట్టూ కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి.. ఇటీవల కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ను విమర్శిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ 1600 కోట్ల విలువైన కాంట్రాక్టు సీఎం రమేష్ కంపెనీకి ఇచ్చారని మండిపడ్డారు..
Also Read: బీజేపీ గుట్టు బయటపెడుతోన్న రాజాసింగ్
సీఎం రమేష్ పై భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎప్పుడైతే ఆరోపణలు చేశారో.. అప్పటినుంచి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మారిపోయాయి.. సీఎం రమేష్ తెరపైకి వచ్చారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించారు. తనను అనవసరంగా వివాదాలలోకి లాగితే మరిన్ని విషయాలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాదు కవిత మద్యం కేసులో జైలుకు వెళ్ళినప్పుడు భారత రాష్ట్ర సమితిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తాను అని చెప్పింది నువ్వు కాదా అంటూ కేటీఆర్ పై సీఎం రమేష్ మండిపడ్డారు. నాడు భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తానని చెబితే.. భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒప్పుకోలేదని.. ఈ విషయం తనతో చెప్పారని సీఎం రమేష్ అన్నారు. అంతేకాదు కేంద్ర దర్యాప్తు సంస్థలను తన మీదికి రాకుండా చూడాలని కేటీఆర్ ప్రాధేయపడిన మాట అబద్ధం కాదు కదా అంటూ సీఎం రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా రిప్లై ఇచ్చారు. వారిద్దరి మధ్య వాద ప్రతివాదాలు ముగిసిన తర్వాత.. అకస్మాత్తుగా ఈ ఇష్యూలోకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. బండి సంజయ్ సంచలన విషయాలను బయటపెట్టారు. కేటీఆర్ కు 2009లో టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించారని.. సమయంలో సీఎం రమేష్ సిఫారసు తో కేటీఆర్ కు కెసిఆర్ టికెట్ ఇచ్చారని.. కేటీఆర్ ను గెలిపించడానికి సీఎం రమేష్ ప్రయత్నించారని బండి సంజయ్ అన్నారు.. సీఎం రమేష్ వల్లే కేటీఆర్ నాటి ఎన్నికల్లో గెలిచారని బండి సంజయ్ కుండ బద్దలు కొట్టారు.. బండి సంజయ్ చేసిన ఆరోపణలను భారత రాష్ట్ర సమితి నాయకులు పొట్టి పారేసినప్పటికీ.. భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో తిప్పుతున్నారు.. కెసిఆర్ లేకుంటే కేటీఆర్ లేడని బిజెపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ” కుమారుడిని ఓ సందర్భంలో కెసిఆర్ నమ్మలేదు.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చాడు..ఉద్యమాన్ని హైజాక్ చేశాడు.. ఇప్పుడు ఏకంగా పార్టీకి కార్య నిర్వాహక అధ్యక్షుడు అయిపోయాడు. గతంలో కేటీఆర్ అంతంతమాత్రంగా ఉండేవాడు. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగేతర శక్తిగా మారిపోయాడని” కమలం పార్టీ నాయకులు కేటీఆర్ ను ఉద్దేశించి చెబుతున్నారు.
కేసీఆర్ మొదట కేటీఆర్‌కు సిరిసిల్ల టికెట్ ఇవ్వలేదు
అప్పుడు కేటీఆర్ వెళ్ళి సీఎం రమేష్‌కు చెప్తే, ఆయన కేసీఆర్‌ని ఒప్పించి టికెట్ ఇప్పించాడు
తర్వాత సీఎం రమేష్ ఆర్థిక సాయం చేసి కేటీఆర్‌ని ఎమ్మెల్యేగా గెలిపించాడు – బండి సంజయ్ pic.twitter.com/opVARv7pql
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2025