CM Revanth Reddy comments: తెలంగాణలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతోంది. ఇటీవల ఇది ఓ మీడియా సంస్థ కారణంగా బయటపడి పెద్ద రచ్చ అయింది. మరో మీడియా సంస్థ అసలు విషయం ఏమిటో బయటపెట్టింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సంస్థలు కొట్టుకుంటూ తమ మంత్రులను బద్నాం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఆయన మంత్రుల ఆధిపత్య పోరును దాచి మీడియాను బద్నాం చేయాలని చూశారు. కానీ వాస్తవ కథ వేరే ఉంది. సీఎం చెప్పిన మీడియా సంస్థల యజమానులు ఏబీఎన్ రాధాకృష్ణ, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి. మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నైనీ గని కాంట్రాక్టు కోసం..
ఒడిశాలోని నైనీ బొగ్గు గని 25 సంవత్సరాల కాంట్రాక్టు వివాదమే ఈ గొడవకు మూలం. సింగరేణి కాలరీస్ కంపెనీ ఆపరేషన్‌లో భాగంగా ఈ గని కోసం పోటీ మొదలైంది. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి అల్లుడికి చెందిన వెన్సా కంపెనీ గని కోసం రంగంలోకి వచ్చింది. మైనింగ్ అనుభవం లేని ఈ సంస్థకు భట్టి విక్రమార్క మద్దతుతో మెగా ఇంజినీరింగ్ భాగస్వామిగా చేరింది. ఎన్టీవీలో మెగా సంస్థ కూడా భాగస్వామి. ఇక మరోవైపు, కోమటిరెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి సుశి ఇన్‌ఫ్రా మైనింగ్, మైనింగ్ నిపుణతతో పోటీ పడింది.
బిడ్ నిబంధనలు మార్పు..
నరేంద్రచౌదరి అల్లుడి కంపెనీకి బిడ్ దక్కేల నియమాల్లో మార్పులే వివాదానికి కారణం. గని ఫీల్డ్ విజట్ సర్టిఫికెట్ కాంట్రాక్టు సంస్థలకు తప్పనిసరి అని నిబంధన చేర్చారు. నరేంద్ర చౌరది అల్లుడి సంస్థకు సింగరేణి ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చింది. Üుశి ఇన్‌ఫ్రాకు ఇవ్వలేదు. ఇది కోమటిరెడ్డి కోపం తెప్పించింది. ఈ గొడవతో సీఎం బిడ్ ప్రక్రియను వాయిదా వేశారు.
మీడియా ప్రతీకారం..
దీంతో నరేంద్రచౌదరి కోమటిరెడ్డిని బద్నాం చేయాలని భావించారు. ఈ మేరకు పేర్లు లేకుండా కోమటిరెడ్డిని ఉద్దేశించి తన టీవీ ఛానల్‌లో ఒక కథనం ప్రసారం చేయించారు. కథనంలో ఒక మంత్రి, ఆయన జిల్లా ఐఏఎస్ అధికారి మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఈ కారణంగా మంత్రి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు మంత్రి ఆ ఐఏఎస్‌కు మంచి పోస్టింగ్ ఇప్పించారని మసాలా జోడించారు. దీనిపై ఐఏఎస్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన భట్టి విక్రమార్క ఎన్టీవీ యాజమాన్యానికి, ఐఏఎస్‌ల సంఘానికి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. కానీ ఐఏఎస్‌లు వెనక్కి తగ్గలేదు. దీంతో ఎన్టీవీకి చెందిన ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యను బీఆర్‌ఎస్, వైసీపీ తప్పు పట్టారు.
రాధాకృష్ణపై అక్కసు..
అసలు విషయాన్ని ఏబీఎన్ రాధాకృష్ణ బయటపెట్టారు. ఇది మీడియా గొడవ కాదు, మంత్రుల మధ్య పోరాటమేనని. దీనిపై భట్టి విక్రమార్క కూడా ఏబీఎన్ కథనాన్ని విమర్శించారు. ఎన్టీవీ యాజమాన్యం క్వాష్ పిటిషన్ వేయాలని కుట్రలు వేస్తోందని ప్రచారం.
ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్రను ప్రతిబింబిస్తోంది. కాంట్రాక్టులు పొందాలంటే మీడియా మద్దతు, నెగెటివ్ ప్రచారాలు ఆయుధాలుగా మారాయి. కోమటిరెడ్డి రాజకీయ ప్రభావంతో టెండర్ కోరుకున్నారు, ఎన్టీవీ మీడియా శక్తితో బెదిరించాలనుకుంది. పార్టీలు, ప్రభుత్వ సంస్థలు, మీడియా మధ్య గీతలు ముఖ్యమైపోయాయి. పరస్పర అవసరాలు తీర్చుకునేందుకు సహకారం చేసుకుంటున్నారు.
