T20 World Cup 2026 : భారత్, శ్రీలంక క్రికెట్ యాజమాన్యాలు t20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. డిపెండింగ్ ఛాంపియన్ గా టీమిండియా రంగంలోకి దిగుతోంది. 2024 t20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు టీమిండియా ఒక్క టి20 ట్రోఫీ కూడా కోల్పోలేదు. చివరికి ఆస్ట్రేలియా పై కూడా టీం ఇండియా విజయం సాధించి తన విజయ గర్వాన్ని దర్జాగా చాటుతోంది..
టీమిండియా మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు బంగ్లాదేశ్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత టీమిండియా, పాకిస్తాన్ తటస్థ వేదికలలో మాత్రమే పోటీపడుతున్నాయి. అలాంటప్పుడు పాకిస్తాన్ భారత గడ్డమీద అడుగుపెట్టే అవకాశం లేదు. గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తటస్థ వేదికలోనే ఆడింది. దుబాయ్ వేదికగా టీమ్ ఇండియా తలపడి.. టోర్నీ విజేతగా నిలిచింది.
ఇటీవలి ఆసియా కప్లో టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీనిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నక్వి రాద్ధాంతం చేశారు. ఏకంగా ఐసీసీ రిఫరీ కి ఫిర్యాదు చేశారు. చివరికి ఆసియా కప్ గెలిచిన టీమ్ ఇండియా.. నక్వీ నుంచి ట్రోఫీ ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా నక్వీ ఆ ట్రోఫీని తన వెంట తీసుకువెళ్లారు. ఈ వివాదం చాలా రోజులపాటు సాగింది. అయితే ఇప్పుడు టి20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వీ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు. టి20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టు చేస్తున్న సన్నాహాలను నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణను కొద్దిరోజుల్లో తెలియజేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రకారం చూసుకుంటే టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు కూడా ఆడేది అనుమానం గానే కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధినేతగా నక్వీ తీసుకునే నిర్ణయాలు.. ఆ జట్టు భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
