indore beggar : బిచ్చగాడు సినిమా చూశారా.. అందులో విజయ్ ఆంటోని బిచ్చం ఎత్తుకుంటూ జీవిస్తుంటాడు. అతడి దుస్థితిని చూసి చాలామంది బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో విజయ్ ఆంటోని వెతుక్కుంటూ చాలామంది వస్తారు. అతడిని చూసి వాహనాల శ్రేణిని ఆపుతారు. ఆ తర్వాత విజయ్ ఆంటోని ఆ కారులోకి ఎక్కుతాడు. చూసేందుకు ఆ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటివి రీ లైఫ్ లో మాత్రమే సాధ్యం. రియల్ లైఫ్ లో పాసిబుల్ కావు. కానీ దీనిని నిజం చేసి చూపించాడు ఈ వ్యక్తి.
మన దేశంలో శుభ్రమైన నగరంగా పేరుపొందిన ఇండోర్ లో ఓ వ్యక్తి యాచకుడిగా జీవిస్తున్నాడు. కాకపోతే అతడు కూటికి గతి లేని వాడు కాదు. గుడ్డకు దిక్కులేనివాడు కాదు. అతడికి ఏకంగా మూడు నివాసాలు ఉన్నాయి. అంతకుమించి అనే స్థాయిలో కార్లు ఉన్నాయి. ఇక ఆటోల గురించి చెప్పాల్సిన పనిలేదు. వడ్డీ వ్యాపారం.. భారీగా బంగారం.. ఇలా చెప్పుకుంటూ పోతే అతడు అత్యంత ఖరీదైన బిచ్చగాడు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపియన్ నిర్వహించింది. ఇందులో అతనికి సంబంధించిన వివరాలు బయటపడ్డాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమేనక బలమైన కారణం ఉంది. వీధుల్లో యాచక వృత్తి చేసుకుంటూ జీవించేవారికి ప్రభుత్వం తరఫున ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో యాచించుకుంటూ జీవిస్తున్న మంకీలాల్ అనే వ్యక్తి పై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. అతడికి పునరాగం కల్పించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వారు అనుకున్నట్టుగా మంగీలాల్ కూటికి గతి లేనివాడు కాదు. అతడికి భారీగా ఆస్తులు ఉన్నాయి.
అధికారుల పరిశీలనలో మంగీలాల్ ఆస్తులు కోట్లల్లో ఉన్నాయి. మంగీలాల్ వద్ద 600 స్క్వేర్ ఫీట్ సామర్ధ్యంతో భగత్ సింగ్ నగర్, శివనగర్, అల్వాస్ అనే ప్రాంతాలలో మూడు నివాసాలు ఉన్నాయి. మూడు ఆటోలు, స్విఫ్ట్ డిజైర్ కార్లు ఉన్నాయి. ఆ కారు నడపడం కోసం మంగీలాల్ ఒక డ్రైవర్ ను కూడా నియమించుకున్నాడు. తను ఈ యాచించడానికి ఎక్కడికి వెళ్లాలన్నా ఆ కారులోనే ప్రయాణ సాగిస్తుంటాడు. ఖాళీ సమయంలో మాత్రం అద్దెకు తిప్పుతుంటాడు. మరోవైపు మంగిలాల్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 1బిహెచ్కే ఇల్లు కేటాయించింది. అయినప్పటికీ అతడు బిచ్చం ఎత్తుకోవడాన్ని. చెక్కతో చేసిన ఒక కార్డు పట్టుకొని ఇండోర్ నగరంలో యాచిస్తున్నాడు. అంతేకాదు సరఫ బజార్ ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తున్నాడు.
