CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో పాటు కేటీఆర్ (కేటీ రామారావు) హరీష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను పడగొట్టి.. తాము సీఎం కావాలని, కేటీఆర్, హరీశ్‌రావు తీవ్రంగా ప్రనయత్నం చేస్తున్నారన్నారు. ఇక కవిత కూడా మరోవైపు ప్రయత్నాల్లో ఉందని వెల్లడించారు. ఈ విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని తెలిపారు. అయితే కేటీఆర్ కల నెరవేరదని స్పష్టం చేశారు. గతంలో కేటీ ఆర్‌ను ప్రమోట్ చేసేందుకు నాటి మంత్రులు భజన చేశారన్నారు. కానీ, అది సాధ్యం కాదని ఈపు చింతపడు అవుతందని చెప్పానన్నారు. తాను చెప్పినట్లుగానే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి.. కాబోయే సీఎం అని ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ 2028లో కూడా తాము అధికారంలోకి వస్తామని, కేసీఆర్‌ను ఖతం చేసి తాము ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని ఆరోపించారు.
Also Read : జైల్లో 16 రోజులు నరకం .. రేవంత్ ను కేసీఆర్ ఇంత టార్చర్ పెట్టాడా?
వాళ్ల కలలు నెరవేరవు..
సీఎం పదవి కోసం బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత పోటీ పడుతున్నారని తెలిపారు. అయితే పెద్దాయన కేసీఆర్ మాత్రం ఆ సీటు వదులుకునే పరిస్థితిలో లేరన్నారు. తాను కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండాలని, ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పోలీసులకు ఆదేశాలివ్వాలి..
కేసీఆర్‌కు ఆ పార్టీకి చెందిన కేటీఆర్, హరీశ్‌రావు, కవిత నుంచి ప్రాణహాని ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులకు కీలక సూచనలు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. కేసీఆర్ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్‌ను ఖతం చేసి కేటిఆర్, హరీష్ రావు ఆయన కుర్చీలో కూర్చోవాలని చూస్తున్నారు – రేవంత్ రెడ్డి pic.twitter.com/5DXGAMHdeE
— Telugu Scribe (@TeluguScribe) March 27, 2025
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Cm revanth reddy cm revanth reddy made key comments about former cm kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com