Allu Arjun : పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాట లో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇందులో అల్లు అర్జున్ మీద ఒక కేసైతే నమోదయింది. ఇక ఈ కేసు మీద అల్లు అర్జున్ ను ఇంతకుముందు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక మరికొద్ది రోజుల్లో అతని బెయిల్ గడువు తేదీ ముగిసిపోవడంతో ఇప్పటికే ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ది తప్పు అని ప్రూవ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ కూడా తన వెర్షన్ వినిపించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇదిలా ఉంటే ఈరోజు మరోసారి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని విచారించినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పిన మాటల మీద మరోసారి విచారించి ఈ కేసులో అసలు ఏం జరిగింది ఏంటి అనే వాస్తవాల్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈరోజు అతన్ని ఉదయం 11 గంటల 5 నిమిషాల నుంచి 2 గంటల 27 నిమిషాల వరకు విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజ్ నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆద్వర్యం లో ఈ విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది… ఇక థియేటర్ యజమాని అయిన నాగరాజును ప్రశ్నించిన తర్వాత అల్లు అర్జున్ ని విచారణలో కూర్చోబెట్టినట్టుగా తెలుస్తోంది.
మరి అల్లు అర్జున్ ఆరోజు థియేటర్ కి రావడానికి పర్మిషన్ లేదనే విషయాన్ని థియేటర్ యజమాని అనే నాగరాజు అల్లు అర్జున్ కి తెలియజేశాడా లేదా అనే విషయంలో విచారణను చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే అల్లు అర్జున్ మీద కూడా విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ విచారణ ముగిసిన తర్వాత పోలీసులకి ఈ కేసు మీద ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకునే విధంగా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అలాగే ఎవరు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే ఆ తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒక పిల్లాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి వాళ్లకు న్యాయం జరగాలంటే ఈ కేసులో నిజానిజాలను బయటికి తీయాలనే ఉద్దేశ్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కేసు ను ముందుకు తీసుకెళ్తున్నాడు…