Champions Trophy 2025: ఇంటర్నేషనల్ క్రికెట్లో భాగంగా ఇండియన్ క్రికెట్ టీం తనదైన రీతిలో సత్తా చాటుతూ వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఐసీసీ నిర్వహించే ట్రోఫీల విషయంలో ఇండియన్ టీమ్ చాలా వరకు కసరత్తులను చేస్తూ ఎలాగైనా సరే ట్రోఫీలను గెలిచే విధంగా రెడీ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం ఇంతకుముందు మనం గమనిస్తూనే ఉన్నాం…ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. ఇక ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు చాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లు జరగబోతున్నట్టుగా ఐసిసి ఒక షెడ్యూల్ ను అయితే రిలీజ్ చేసింది. ఇక అందులో భాగంగానే ఇండియా- పాకిస్ధాన్ మధ్య జరగబోయే మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టీము లు ఉన్నాయి…ఇక గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ టీములు ఉన్నాయి…
ఇక ఈ ఎంటైర్ ట్రోఫీలో భాగంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లను పాకిస్థాన్ లాహోర్ లో నిర్వహించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇండియా కనుక సెమీ ఫైనల్ కి వెళ్ళిన, ఫైనల్ కి వెళ్లినా కూడా ఆ మ్యాచ్లను దుబాయ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేశారు…
ఇక చాలా రోజులు తర్జనభర్జనల తర్వాత హైబ్రిడ్ మోడల్ లోనే ఈ టోర్నీ ని జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే 2024 నుంచి 2027 మధ్య జరిగే మ్యాచ్ ల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా తటస్థ వేదికల పైననే మ్యాచులు జరిగే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు…
ఇక మొత్తానికైతే ఇండియన్ టీమ్ పాకిస్తాన్ లో అడుగు పెట్టే అవకాశమే లేదు అన్నట్టుగా మన బీసీసిఐ చాలా స్ట్రాంగ్ గా తెలియజేయడంతో దెబ్బకు ఐసిసి దిగివచ్చి మనకు అనుకూలమైన రూల్స్ ని పెట్టి మనకు అనుకూలమైన రూల్స్ పెడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ టీమ్ పవర్ ఏంటో ఇప్పుడు పాకిస్తాన్ కి బాగా తెలిసి వచ్చిందనే చెప్పాలి…
Check out the full fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca
— ICC (@ICC) December 24, 2024