Telangana BJP President: తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. బిజెపి అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే రెండు చోట్ల ఏకగ్రీవ ఎన్నికకు హై కమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్( pvn Madhav ), తెలంగాణకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పేరుకే ఎన్నికలు కానీ.. హై కమాండ్ ఈ ఇద్దరి విషయంలో నిర్ణయం ప్రకటించినట్లు సమాచారం. వీరితోనే నామినేషన్ వేయించి వారి పేర్లు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలని బిజెపి నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర పగ్గాలు బీసీ నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో ఎన్డీఏ అధికారంలో ఉండడం.. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించడం.. ఏపీలో అధికార కూటమి ఉండడంతో అధ్యక్ష పదవుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. అయితే రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని బిజెపి ఒక తుది నిర్ణయానికి వచ్చింది. ఇద్దరు బీసీ నేతలను ఎంపిక చేసింది.
Also Read: ఆంధ్రజ్యోతిలో టార్చర్.. చనిపోతానంటూ రిపోర్టర్ వీడియో వైరల్
* తెర వెనుక చంద్రబాబు
అయితే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఎంపికైన రామచంద్రరావు( Ramchandra Rao) నియామకం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. రామచంద్రరావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నేత. ఆపై ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామి. బిజెపి పెద్దల వద్ద ఆయన మాట చెల్లుబాటు అవుతున్నట్లు ప్రచారం ఉంది. తెలంగాణలో త్వరలో తెలుగుదేశం పార్టీ భారీ ఎంట్రీ ఇవ్వబోతోంది. వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసేందుకు టిడిపి నిర్ణయం తీసుకుంది. అదే జరిగితే బిజెపి తరఫున సమన్వయం చేసుకునే నేత అవసరం. అందుకే ఒకప్పటి తనతో కలిసి పని చేసిన రామచంద్ర రావు పేరును చంద్రబాబు బిజెపి పెద్దలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
* బిజెపిలో అంచెలంచలుగా
రామచందర్రావు సుదీర్ఘ కాలం పాటు బిజెపిలో ( Bhartiya Janata Party)కొనసాగుతూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే బిజెపి యువమోర్చా నుంచి పనిచేయడం ప్రారంభించారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అటు తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో సాన్నిహిత్యం ఏర్పడింది. 2015లో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు రామచంద్రారెడ్డి. ఆ సమయంలో సైతం చంద్రబాబు నుంచి పరోక్ష సహకారం అందినట్లు ప్రచారం ఉంది. అయితే తెలంగాణ అధ్యక్ష పదవిని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కోరుకున్నారు. ధర్మపురి అరవింద్ సైతం చివరి వరకు ఆశావాహుల జాబితాలో ఉన్నారు. కానీ చివరి నిమిషంలో రామచందర్రావుకు ఆ పదవి దక్కింది. అది చంద్రబాబు వల్లేనట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన ఎన్. రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యకుడిగా ఖరారు చేసిన అధిష్టానం
ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి రాకుండా చెక్ పెట్టిన బీజేపీ సీనియర్ నాయకులు
రామచందర్ రావును నామినేషన్ వేయాలని… pic.twitter.com/Abnnf0uHDB
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2025