KTR: బ్రేకింగ్ : కేటీఆర్‌పై కేసు నమోదు..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కించపరిచేలా కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Written By: Raj Shekar, Updated On : March 29, 2024 6:59 pm

KTR

Follow us on

KTR: కొన్ని వారాలుగా బీఆర్‌ఎస్‌ నాయకులు న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 16న ఈడీ అరెస్టు చేసింది. పది రోజుల కస్టడీ తర్వాత తిహార్‌ జైలుకు తరలించింది. తర్వాత బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కేసీఆర్‌ మేనల్లుడు జోగినపల్లి సంతోష్‌రావుపైనా భూ ఆక్రమణ కేసు నమోదైంది. హైదరాబాద్‌లో అక్రమంగా భూమి కబ్జా చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌పైనా కేసు నమోదైంది.

సీఎంపై చేసిన వ్యాఖ్యల ఫలితం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కించపరిచేలా కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లు మంత్రులు ఎక్కడికి వెళ్లినా విపక్షాలను అరెస్టు చేసేశారు. నిర్భందించేవారు. అక్రమంగా కేసులు పెట్టేవారు. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్‌ అయింది. ఇప్పుడు అవే కేసులను బీఆర్‌ఎస్‌ నేతలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై కేసు పెట్టారు. అయితే తనపై దాఖలైన ఈ కేసుపై కేటీఆర్‌ ఇంకా స్పందించలేదు.

మాటల యుద్ధం..
ఇదిలా ఉండగా, తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలూ కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ బీఆర్‌ఎస్‌ను వీడేవారి సంఖ్య పెరుగుతుండడంతో ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి మరీ పార్టీ వీడే నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు అయితే పార్టీ వీడేవారంతా రాజకీయ వ్యభిచారులు అని పేర్కొన్నారు. పవర్‌ బ్రోకర్లుగా అభివర్ణించారు. కేటీఆర్‌ అయితే రంజిత్‌రెడ్డి, పట్న మహేందర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. పార్టీ మారమని ఆస్కార్‌ రేంజ్‌లో నటించారని విమర్శించారు. 15 రోజులకే ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు. కేసీఆర్‌ కూతురు జైలుకు వెళితే వారు మాత్రం ఇక ఇకలు, పకపకలతో పార్టీ మారారని మండిపడ్డారు. మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి తీసుకోబోమన్నారు.