Cartages Surrounded By Water: మనసు ఉల్లాసంగా ఉండడానికి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటారు. వీకెండ్ లో లేదా నెల చివరిలో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తారు. కొందరు దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటే..మరికొందరు దగ్గర్లో ఏదైనా మంచి ప్లేస్ ఉందా? అని సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే తెలంగాణలో ఓ కొత్త పర్యాటక ప్రదేశం సిద్ధమైంది. హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న ఈ ప్రదేశంలో చెరువులో ఉన్న నీరు ఆహ్లదపరుస్తుంది.నీటి మధ్యలో స్టే చేయడానికి కొత్తగా కార్టేజీలను నిర్మించారు. ఇందులో స్విమ్మిపూల్స్, పిల్లలు ఆడుకోవడానికి అనువైన ప్రదేశం ఉంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు చాలా వరకు ఉన్నాయ. కానీ వాటిని అభివృద్ధి చేయకపోవడంతో అవి మరుగునపడిపోతున్నాయి. అయితే ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం చెరువు ఇప్పటికే టూరిస్ట్ ప్లేస్ గా గుర్తింపు పొందింది. కానీ దీనిని ఇటీవల మరింత కొత్తగా తీర్చి దిద్దారు. ములుగు జిల్లాలోని గోవింతరావుపేట మండలం బుస్సాపూర్ శివారులో ఉన్న లక్నవరం చెరువు లో రెండు ద్వీపాలు బాగా ప్రసిద్ధి చెందాయి. తాజాగా మూడో ద్వీపాన్ని అభివృద్ధి చేశారు.
లక్నవరం చెరువులోని మూడో ద్వీపం సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఐలాండ్ ను పచ్చదనంతో తీర్చి దిద్దారు. టీఎస్ టీడీసీ, ఫ్రీ కోట్స్ సంస్థ కలిసి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఆహ్లదంగా మార్చారు. ఇక్కడున్న చెట్లను అందంగా తయారు చేశారు. ఇక్కడ మొత్తం 22 కార్టేజీలను ఏర్పాటు చేశారు. ఇందులో 4 కటుుంబాలు స్టే చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కార్టేజీలకు స్విమ్మింగ్ ఫూల్స్ ఏర్పాటు చేశారు. కొన్ని చిన్న పిల్లలకు కోసంప్రత్యేకంగా ఉంచారు.
ప్రపంచ పర్యాటక ప్రదేశాలైన మాల్దీవులు, మున్నార్, షిమ్లా తరహాలో లక్నవరం మూడో ఐలాండ్ ను తీర్చిదిద్దారు. ఈ ఐలండ్ లో ప్రీకోట్స్ కు చెందిన 40 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతంనిర్మాణ పనులు ఇంకా సాగుతున్నాయి. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది.
ఈ ఐలాండ్ ను వీక్షిస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారికి అనువైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్ల వరకు నేరుగా వరంగల్ కు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అక్కడి నుంచి లక్నవరం వరకు బస్సుల్లో ప్రయాణించవచ్చు. దేశంలోని ప్రజలు ఇక్కడికి రావాలన్న రైలు సౌకర్యాలు ఉన్నాయి. దట్టమైన అడవి మధ్యలో ఉన్న లక్నవరం చెరువుకు మేడారం జాతర సమయంలో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అయితే ప్రస్తుతం మూడో ఐలాండ్ అభివృద్ధి చెందిన నేపథ్యంలో పర్యాటకులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. లక్నవరం వచ్చే వారు ఇక్కడికి మాత్రమే కాకుండా వరంగల్ సిటీలోని ఖిలా వరంగల్, రామప్ప తదితర ప్రదేశాలకు వెళ్లొచ్చు. కాకతీయులు ఏలిన గడ్డగా పేరున్న వరంగల్ జిల్లాలో ఇంకా అనేక పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు.