Asteroid : రెండూ మూడేళ్లుగా అంతరిక్షంలోని అనేక గ్రహ శకలాలు భూమికి సమీపంలోకి వస్తున్నాయి. భూ ప్రమణంతోపాటు గ్రహాలు, ఉల్కల పరిభ్రమణం కారణంగా అనేక ఆస్టరాయిడ్స్ అంతరిక్ష ఆకర్షణ నుంచి విడిపోయేలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భూమికి సమీపంలోకి వస్తున్నాయి. అయితే భూ అయిస్కాంత క్షేత్రంలోకి వస్తే.. అవి భూమిపై పడే ప్రమాదం ఉంది. అదే జరిగితే భారీగా నష్టం జరుగుతుంది. అయితే ఇంతవరకు చాలా గ్రహ శకలాలు భూమికి సమీపంలోకి వచ్చాయి. కానీ, ఎలాంటి నష్టం జరుగలేదు. ఈ క్రమంలో ఆస్టెరాయిడ్ 2020 డబ్ల్యూజీ ఇప్పుడు భూమికి సమీపంలోకి రాబోతోంది. ఈనెల 28న ఇది భూమి సమీపంలోకి వస్తుందని అంతరిక్ష పరిశోధకులు అంచనా వేశారు. దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ మొదట గుర్తించింది. భూమికి అతీసమీపంలోకి అంటే 3.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి రాబోతోందని తెలిపారు.
చంద్రునికి మద్య ఉన్న దూరం కన్నా 9 రెట్లు..
ఆస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ భూమికి వచ్చే దూరం భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కన్నా 9 రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. సమీపం నుంచి దూసుకెళ్లే ఈ ఆస్టరాయిడ్ కారణంగా భూమికి ఎలాంటి ముప్పు ఉండదని సైంటిస్టులు పేర్కొంటున్నారు. గ్రహ శకలాలపై మరిన్ని పరిశోదనలకు ఇది తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది సెకనుకు 9.43 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని అంచనా వేశారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించవచ్చని తెలిపారు.
అరుదైన అవకాశం..
ఇదిలా ఉంటే… ఆస్టెరాయిడ్ 2020 డబ్ల్యూజీ భూమికి సమీపంలోకి రావడం అరుదైన అవకాశంగా తెలిపారు. భవిష్యత్‌లో భూమికి సమీపంలోకి రాబోయే గ్రహ శకలాలు, వాటి నుంచి వచ్చే ముప్పు, ఆ ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి ఈ ఆస్టరాయిడ్ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈమేరకు నాసా పరిశోధన చేస్తుందని తెలిపారు.