https://oktelugu.com/

TS Group 1 Exam Cancelled: బిగ్ బ్రేకింగ్: గ్రూప్_1 పరీక్ష రద్దు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు గ్రూప్_1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసేందుకే మొగ్గు చూపింది." లక్షలాదిమంది నిరుద్యోగుల భవితవ్యాన్ని నిర్దేశించే పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Written By:
  • Rocky
  • , Updated On : September 23, 2023 / 01:34 PM IST

    TS Group 1 Exam Cancelled

    Follow us on

    TS Group 1 Exam Cancelled: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 11న నిర్వహించిన గ్రూప్_1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ శనివారం రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని మళ్లీ నిర్వహించాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్_1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. 503 పోస్టుల భర్తీ కోసం కమిషన్ ఈ పరీక్ష నిర్వహించగా.. 2.32 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

    అయితే గతంలోనే ప్రభుత్వం గ్రూప్_1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కొంత ఉద్యోగుల నిర్వాకం వల్ల పేపర్ లీక్ అయింది. దీంతో కమిషన్ నాలుక కరుచుకుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పరీక్షను రద్దు చేసింది. ఆ తర్వాత పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రభుత్వ పరంగా ఉచితంగా శిక్షణ, వసతి కల్పిస్తామని ముఖ్యమైన మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ హామీని విస్మరించారు. ఎప్పటిలాగానే అభ్యర్థులంతా లక్షలకు లక్షలు ఖర్చు చేసి పరీక్ష రాశారు. పరీక్ష రాసే క్రమంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన జాగ్రత్త చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ హాజరు తీసుకోకపోవడం పట్ల అనుమానాలకు తావిచ్చింది. పైగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం.. పేపర్ రూపకల్పన కూడా తెలంగాణ చరిత్రకు దూరంగా ఉండటం..ఈ పరిణామాలు బోర్డు పనితీరును మరోసారి తేటతెల్లం చేశాయి. ఈ క్రమంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

    సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు గ్రూప్_1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసేందుకే మొగ్గు చూపింది.” లక్షలాదిమంది నిరుద్యోగుల భవితవ్యాన్ని నిర్దేశించే పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంలో పేపర్ లీక్ అయినప్పుడు ఇలానే వ్యవహరించారు. ఇది సరైన పద్ధతి కాదు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి. నిరుద్యోగుల కలలను సాకారం చేయాలి” అని కోర్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఈ పరీక్షను రద్దు చేస్తూ తాము నిర్ణయం తీసుకున్నామని, మరలా పరీక్ష నిర్వహించాలని బోర్డుకు సూచించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పరీక్ష రద్దయిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అధికార పార్టీ నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని, బోర్డు సభ్యుల నియామకం రాజకీయ కోణంలో ఉన్నదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కాగా ఎన్నికల ముంగిట గ్రూప్_1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడం, హైకోర్టు చాలా విస్పష్టంగా తీర్పు ఇవ్వడంతో అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది