BRS Leaders Probe: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఆసక్తికరమైన ఎపిసోడ్ మొదలయ్యింది. ఇప్పటివరకు బాధితుల జాబితాలో ఉన్న వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాకపోవడంతో వారు సిట్ పిలిచిన వెంటనే వెళ్లి హాజరయ్యారు. ఇప్పుడు వారు ఈ విధంగా స్పందిస్తారో అనేది హాట్ టాపిక్ అయ్యింది. సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ జాబితాలో వ్యక్తులను కూడా క్లైమాక్స్ లో పిలిచే అవకాశాలున్నాయి. అప్పుడు పరిస్థితి వేరేలా ఉండవచ్చని అనుకుంటున్నారు.
ఆర్ ఎస్ ప్రవీకుమార్ ఐపీఎస్ కు సిట్ పిలుపు
కానీ ప్రస్తుతం తాజాగా బిఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ను వాగ్మూలం ఇచ్చేందుకు సిట్ అధికారులు పిలిచారు. కానీ అందుకు ఆయన ససేమిరా అంటున్నారు. ఒక పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రవీణ్ కుమార్ తాను సిట్ విచారణకు హాజరు కానని తెలపడం వెనుక కారణాలు ఏమై ఉంటాయని చర్చించుకుంటున్నారు.
బీఎస్పీ చీఫ్ గా ఉన్న సమయంలో కేసీఆర్ పై ఒంటికాలు మీద లేచి విమర్శలు గుప్పించిన ఆయన ఒక సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు.
Also Read: నారా భువనేశ్వరి ఒక్కరోజు ఆదాయం రూ.78.80 కోట్లు!
ట్యాపింగ్ బాధితుల జాబితాలో ప్రవీణ్ కుమార్ తో పాటు ఇంకా బిఆర్ఎస్ లో పెద్ద తలకాయల పేర్లు బయటికి రావచ్చని, వారిని కూడా విచారణకు పిలిచినప్పుడు పరిస్థితి వేరే ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక పిల్లలా తయారైంది. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తన ఫోన్ ట్యాప్ అయిందని మింగలేక, కక్కలేనీ పరిస్థితిలో ఉన్నారు.
అయితే ఇలా విచారణకు హాజరు కావాళ వద్ద అనే మీమాంస లో పడి తిరిగి విచారణకు హాజరైన తరువాత ఎంత ఘోరంగా ట్యాప్ చేశారో వివరిస్తూ తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారని పలు ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: చీపురు చేతబట్టి.. ఆలయాన్ని కడిగి.. ‘బాబు’ గారు మారిపోయారు
ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. గురుకులాల్లో ఒక మార్పుకు ఆయన శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు అనితర సాధ్యమైన విజయాలు సాధించారు. వారిలో టాలెంట్ ను బయటికి తీసేందుకు ఆయన కొత్త విధానాలను రూపకల్పన చేశారు. స్వెరో ను స్థాపించి ఎండోమందికి మార్గదర్శి అయ్యారు. అనంతరం వీఆర్ఎస్ తీసుకుని రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. బీఎస్పీ లో చేరి ప్రధాన భూమిక నిర్వర్తించిన ఆయన రాజకీయం మరో మలుపు తిరిగింది. బీఆర్ఎస్ లో చేరి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లారు. విచారణ లో ఏ విషయాలు బయటపడవచ్చని, ఆ తరువాత ఆయన ఏ సంచలన నిర్ణయం తీసుకుంటారనే విషయమై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ సినిమా క్లైమాక్స్ కు వచ్చినట్లేనా.. ఇంకా ఏమైనా మిగిలి ఉందా అని చర్చ జరుగుతోంది.